బాబు..నమ్మకమే ‘గెలుపు’?

M N Amaleswara rao
రాజకీయాల్లో నమ్మకమే గెలుపుకు కారణమవుతుంది...నాయకులపై ప్రజలకు నమ్మకం కలిగితే వారిని గెలిపించడానికి వెనుకాడరు. తమ భవిష్యత్ బాగుంటుందని నమ్మకం కలిగించే నాయకులని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు. అలాగే ప్రజలు నమ్మకం వమ్ము కాకుండా పనిచేసిన నాయకులకు తిరుగుండదు. అయితే ఆ నమ్మకమే ఇప్పుడు చంద్రబాబుకు కాస్త తక్కువైందని చెప్పొచ్చు. రాజకీయాల్లో నాయకులు మామూలుగానే మాట తప్పిస్తారు. కాకపోతే ప్రజలు పూర్తిగా పట్టించుకోకపోవచ్చు. కానీ అదే పనిగా మాట తప్పితే మాత్రం..అలాంటి నాయకులని పక్కన పెట్టేస్తారు.

అందుకే గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబుని పక్కన పెట్టారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఎడాపెడా హామీలు ఇచ్చారు. ఒకప్పుడు మాదిరిగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం పొరపాటే..ఎందుకంటే మీడియా ప్రాధాన్యత పెరిగాక అదంతా జరిగే పని కాదు. అందుకే బాబు ఫుల్ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. దీంతో 2019లో ప్రజలు బాబుని ఓడించారు.

ఇక 2019 ముందు జగన్ కూడా విపరీతంగా హామీలు ఇచ్చారు...మరి ఆయన ఏమన్నా నిలబెట్టుకుంటున్నారా? అంటే అబ్బో ఆయన కూడా పలు హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారు. కానీ కొన్ని హామీలని మాత్రం కరెక్ట్‌గా నిలబెట్టుకుంటున్నారు. అందుకే కాస్త ప్రజలు జగన్‌పై నమ్మకంతో ఉన్నారు. అయితే బాబుపై ప్రజలకు నమ్మకం కుదురుతున్నట్లు కనిపించడం లేదు.

ప్రస్తుతం ఏపీలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న మాట వాస్తవం...వైసీపీపై వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్‌గా టీడీపీకే బెనిఫిట్. కానీ అనుకున్న మేర టీడీపీకి బెనిఫిట్ వస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం ఇంకా రావడం లేదు..గతంలో వరుసగా మాట తప్పడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ బాబు..ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి వీటిని కూడా జనం నమ్మడానికి సిద్ధంగా ఉండటం లేదు. కాబట్టి ముందు బాబు..ప్రజల నమ్మకం పెంచుకోవాలి...అప్పుడే గెలవడానికి అవకాశం ఉంటుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: