కెనడాలో దారుణం.. రోడ్ల మీదికి వచ్చేసారు?

praveen
కరోనా వైరస్ టైంలో వ్యాక్సిన్ అనేది ఎంత కీలకంగా మారింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక చిన్న సూది ఏకంగా ఆరడుగుల మనిషి ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది. మొదట్లో వ్యాక్సిన్ గురించి భయపడిపోయిన జనాలు ఇప్పుడు మాత్రం అవగాహన రావడంతో వ్యాక్సిన్ వేసుకోవటానికి ముందుకు వస్తున్నారు.  వ్యాక్సిన్ విషయం లో ఇప్పటికీ భయపడుతున్న వారికి అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. కానీ కెనడా లాంటి పాశ్చాత్య దేశాల్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకుని ప్రాణాలు కాపాడుకోండయ్య స్వామి అని చెప్తుంటే..  ప్రభుత్వం మొత్తం ఆస్తిని బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వండి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఫీలవుతున్నారు.

 ఇక కెనడాలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కరోనా నుంచి దేశాన్ని రక్షించడం దేశ అధ్యక్షుడి బాధ్యత.  ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అయినా అధికారం ఉంటుంది. కానీ కెనడాలో వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద సంచలనమే అయ్యింది. దేశంలోకి వచ్చే ట్రక్ డ్రైవర్లు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలే కెనడా ప్రధానినీ సరికొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.

 చివరికి అధికారికా కార్యాలయం నుంచి కెనడా ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చాయి. ఇలా కెమెరా లో నెలకొన్న  పరిస్థితులు ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం వ్యాక్సిన్ వేసుకోమన్నందుకు ట్రక్కు డ్రైవర్ లు ఎంత చెలరేగిపోయారు అంటే దేశంలోని ఆరు ప్రాంతాల్లో ట్రక్ లతో బ్లాక్ చేస్తూ రోడ్డు రవాణా స్తంభింప చేశారు. దీంతో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతుంది పరిస్థితి. ఈ  ఉద్యమం కారణంగా దేశం మొత్తం మన జీవనం స్తంభించిపోయినా పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: