భర్త ఆస్తిపై భార్యకు హక్కు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

frame భర్త ఆస్తిపై భార్యకు హక్కు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

praveen
ఇటీవలి కాలంలో ఎన్నో కేసుల్లో కోర్టులు షాకింగ్ తీర్పు ఇస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సుప్రీం కోర్టు ఇలాంటి తరహా తీర్పుతో ఆశ్చర్యపరిచింది. భర్త పేరుమీద ఉన్న ఆస్తి అతను చనిపోయిన తర్వాత ఎవరికి చెందుతుంది. భార్యకుభర్త ఆస్తులపై ఏ మేరకు హక్కు ఉంటుంది అన్నది ఇప్పటికీ ఎంతోమంది లో నెలకొన్న ప్రశ్న. ఇకపోతే ఇలాంటి కేసు ఇటీవల సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు షాకింగ్ తీర్పును వెలువరించింది.


 ఒక హిందూ వ్యక్తి భార్య పోషణ బాగోగుల నిమిత్తం ఏర్పాట్లు చేసి, ఇక తాను సంపాదించి పెట్టిన ఆస్తిని కట్టుకున్న భార్య జీవితాంతం అనుభవించేలా కొన్ని పరిమితులతో కూడిన వీలునామా రాస్తే.. ఇక అలాంటి ఆస్తిపై భార్యకు సంపూర్ణమైన హక్కులు ఉండవు అంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... హర్యానాకు చెందిన తులసీరామ్ మొదటి భార్య చనిపోవడంతో రామ్ దేవి అనే మహిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇకపోతే కుమారుడు భార్య పేరుపై  1968 లోనే తులసి రామ్ ఒక వీలునామా రాయడం గమనార్హం.


 తాను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని రెండవ భార్య రామ్ దేవి జీవిత కాలమంతా అనుభవించవచ్చు. అంతేకాదు తన ఆస్తి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవించవచ్చు అంటూ తులసీరామ్ ఆ వీలునామాలో పేర్కొన్నాడు. కానీ ఆమె మరణానంతరం మాత్రం ఆస్థి సంపూర్ణంగా తన కుమారుడికి చెందాలని వీలునామాలో రాశాడు  తులసీరామ్. కానీ ఈ వీలునామా ని కాదని రామ్ దేవి నుంచి కొంతమంది వ్యక్తులు ఆస్తిని కొనుగోలు చేయడం వివాదంగా మారి పోయింది. చివరికి ఈ కేసు సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రామ్ దేవి నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వ్యక్తులకు అనుగుణంగా సేల్ డిడి కొనసాగించలేమని ఈ ఆస్తి మొత్తం వీలునామా ప్రకారం తులసీరామ్ కొడుకు కి వెళ్తుంది అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: