కారుని లేపుతున్న హస్తం..?
ఇక రేవంత్ చేసే కామెంట్లు కూడా వాస్తవానికి దూరం ఉన్నట్లు కనిపించవు. అప్పుడప్పుడు టీఆర్ఎస్-బీజేపీల రాజకీయం చూస్తుంటే...కావాలని కాంగ్రెస్‌ని సైడ్ చేయడానికేనా అన్నట్లు ఉంటుంది. సరే చాలావరకు టీఆర్ఎస్కు బీజేపీ పరోక్షంగా సాయం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు టీఆర్ఎస్కు కాంగ్రెస్ ఎలా సాయం చేస్తుందని అనుకోవచ్చు. దీనికి కూడా క్లారిటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు.
టీఆర్ఎస్-బీజేపీలు కలిసి డ్రామా ఆడుతుంటే కాంగ్రెస్ ఆ డ్రామాని ఆపలేకపోతుందా? కమలం వల్ల ఓట్లు చీలిపోతాయని భయపడుతున్నప్పుడు... ఇంకా ప్రజలు మద్ధతు పెంచుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పైన లేదా? అంటే ఉందనే చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏ మాత్రం పనిచేయడం లేదు. పక్క పార్టీలపై పోరాటడం చేయడం పక్కనబెడితే...ముందు సొంత పార్టీలోనే నేతలే...ఒకరిపై ఒకరు పోరాటం చేసుకుంటున్నారు.. విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీని మరింత డ్యామేజ్ చేసేలా ముందుకెళుతున్నారు..రేవంత్ ఎంత లైన్లో పెట్టాలని చూసినా సరే ప్రయోజనం లేకుండా పోతుంది.
అసలు సొంత గొడవలతోనే ముందుకెళితే..ఇంకా టీఆర్ఎస్పై పోరాడేది ఎప్పుడు...ప్రజల మద్ధతు దక్కించుకునేది ఎప్పుడు. ఎంతసేపు ఇదే రచ్చతో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం అసాధ్యం. ఒకవేళ బీజేపీ బాగా ఓట్లు చీల్చి కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేసి, టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కృషి చేస్తే...ఆ తప్పు కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. మూడో సారి కూడా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందంటే...అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పొచ్చు. మరి చూడాలి కాంగ్రెస్..టీఆర్ఎస్ని అధికారంలో నుంచి దించుతుందో..అధికారంలోకి తీసుకొస్తుందో.