ష‌ర్మిల ఫైర్ : అభయ హ‌స్తం ఏమైంది?

RATNA KISHORE

నాన్న వైఎస్సార్ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏక‌ప‌క్షంగా ర‌ద్దు చేయ‌డం త‌గ‌ద‌ని వైఎస్సార్టీపీ అధినేత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.తాజాగా సామాజిక మాధ్య‌మాల ద్వారా కొన్నిప్ర‌శ్న‌లుంచారు. అభ‌య హ‌స్తం ప‌థ‌కంపై స్పందించారు.ఈ నేప‌థ్యంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన అభ‌య హ‌స్తం ప‌థ‌కం ఎందుకు ఎత్తివేశార‌ని ప్ర‌శ్నిస్తూ వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల ఫైర్ అయ్యారు.ఈ ప‌థ‌కం ద్వారా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎంద‌రికో మేలు జ‌రిగింద‌ని,వెంట‌నే ఈ ప‌థ‌కాన్ని తిరిగి ప్రారంభించి,అర్హులైన మ‌హిళ‌ల‌కు పింఛ‌న్లు ఇవ్వాల‌ని ఆమె పట్ట‌బడుతున్నారు.ఆ రోజు పొదుపు సంఘాల్లో స‌భ్య‌త్వం ఉండి, వృద్ధాప్యంలో ఉన్న మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డింది.



కానీ కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ ప‌థ‌కాన్ని ఎత్తివేశారు. ఈ ప‌థకం స్థానంలో ఆస‌రా ప‌థ‌కాన్ని తెచ్చారు.ఆ రోజు మ‌హిళ‌ల దగ్గర నుంచి రోజుకు రూపాయి చొప్పున వ‌సూలు చేసి ఏడాదికి 365 రూపాయ‌లు కూడితే, ఏడాది ఆఖరులో అంతే మొత్తాన్ని క‌లిసి ఆ ల‌బ్ధిదారుల ఖాతాలో జ‌మ చేశారు.ఈ విధంగా అప్ప‌ట్లో 1500కోట్ల రూపాయ‌లు జ‌మ అయ్యాయ‌ని టాక్ ఉంది.

అయితే ఈ మొత్తం నుంచి భ‌ర్తకు పెన్ష‌న్ వ‌చ్చినా స‌రేవ వృద్ధాప్యంలో ఉన్న భార్య‌కూ పింఛ‌ను ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌తో నెల‌కు ఐదు వంద‌ల చొప్పున  2 లక్షల 20 వేల 12 మందికి పింఛ‌ను ఇచ్చారు.ఇదంతా విభ‌జ‌న‌కు ముందు క‌థ. విభ‌జ‌న త‌రువాత ఆ ప‌థ‌కాన్ని రద్దు చేసి, ఆస‌రా కింద కేసీఆర్ వెయ్యి రూపాయ‌ల చొప్పున పెన్ష‌న్ ఇస్తున్నారు.దీంతో పాత ప‌థ‌కాన్ని ర‌ద్దు చేశారు.ఆ ప‌థ‌కంలో దాచుకున్న వారికి డ‌బ్బులు తిరిగి ఇచ్చేందుకు వివ‌రాలు కూడా సేక‌రించారు.తాజాగా షర్మిల సీన్ లోకి వ‌చ్చి ఆ ప‌థ‌కం గొప్ప‌ద‌నం గురించి సామాజిక మాధ్య‌మాల ద్వారా వివ‌రిస్తూ,వెంట‌నే ఆ ప‌థ‌కాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నారు.ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏ విధంగా స్పందించ‌నున్నారో ఆస‌క్తిగానే ఉంది.ఎందుకంటే తాను తీసుకువ‌చ్చిన ఆస‌రా ప‌థ‌కం ద్వారా నెల‌కు వెయ్యి పింఛ‌ను ఇస్తుంటే, అలాంట‌ప్పుడు వైఎస్సార్ తీసుకువ‌చ్చిన అభ‌య హ‌స్తంతో ప‌నేంట‌ని ఎదురు ప్ర‌శ్నించే అవ‌కాశాలూ లేక‌పోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: