గుడ్ న్యూస్: నైట్ కర్ఫ్యూ ఎత్తివేత... పాఠశాలల ప్రారంభం
దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అయితే గత వారం నుండి కొద్ది కొద్దిగా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ప్రభుత్వం వైద్య శాఖతో జరిపిన సమావేశాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ ను ఎత్తి వేస్తున్నట్లు కాసేపటి క్రితమే ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా పాఠశాలలు మరియు విద్యాసంస్ధలను కూడా ప్రారంభించవచ్చని తెలిపింది. దీనితో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులు మరియు స్కూల్స్ యాజమాన్యాలు అన్ని కరోనా నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక మిగిలిన థియేటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పబ్స్ మరియు బార్స్ లలో 50 శాతం వరకు అనుమతించేలా వెసులుబాటును కల్పించింది. అయితే ఇప్పటి నుండే అసలైన సవాల్ మొదలు కానుంది. ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకపోయినా మళ్ళీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది.