పుదుచ్చేరి : ఇస్మార్ట్ ఎమ్మెల్యే కథ ఎక్కడంటే?
అక్కడ శాసన సభ సభ్యుడిగా గెలిస్తే చాలు... ఒకటి కాదు , రెండు కాదు ఏకంగా రెండు కోట్ల రూపాయల పైచిలుకు వస్తువులు మీ ఖాతాలో చేరుతాయి. వాటిల్లో ఐ ఫోన్, ఐ ప్యాడ్ తదితర వస్తువులే కాదు కుదిరితే లేటెస్ట్ మాడ్ ల్ ఏం.జి కారు కూడా. ఆ ఇస్మార్ట్ ఎమ్మెల్యే కథ ఎక్కడో తెలుసుకోవాలను ఉందా మీకు
పుదుచ్చేరి శాసనసభలోని 33 మంది సభ్యులకు వారి వారి నియోజకవర్గ కార్యాలయాలకు ఐప్యాడ్, ఐఫోన్, ఐమ్యాక్ డెస్క్‌టాప్, మల్టీ పర్పస్ ప్రింటర్, ఫోటోకాపియర్ మెషిన్, కార్యాలయ సామగ్రి మరియు ఫర్నిచర్ అక్కడి ప్రభుత్వం సమకూర్చింది.
స్పీకర్ ఆర్ సెల్వం, అసెంబ్లీ కార్యదర్శి ఆర్ మునుసామి సమక్షంలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి శాసన సభ్యులకు ఈ వస్తువులను పంపిణీ చేశారు.
వీటిని శాసనసభ సచివాలయం రూ. 2.5 కోట్లతో కొనుగోలు చేసి, ముఖ్యమంత్రి, స్పీకర్‌తో సహా అందరికీ వారి నియోజకవర్గ కార్యాలయాల కోసం అందించినట్లు అసెంబ్లీ సెక్టరీ నుంచి ఒక ప్రకటన వెలువడింది
ఫర్నిచర్లో ఎమ్మెల్యేకు ఎగ్జిక్యూటివ్ కుర్చీ మరియు టేబుల్, అతని ప్రైవేట్ అసిస్టెంట్ కోసం ఒక సాధారణ కుర్చీ టేబుల్, సందర్శకుల కోసం సోఫా సెట్, అల్మరా మరియు టెపోయ్ ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే కోసం వేచి ఉండే ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు.
గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ విప్, ముఖ్యమంత్రి పార్లమెంటరీ కార్యదర్శి, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు 11 కొత్త కార్లను ప్రభుత్వం అందించింది. ఇన్నోవా కారును పొందిన డిప్యూటీ స్పీకర్ మినహా మిగిలిన వారందరూ కియా మరియు MG కార్ల యొక్క తాజా బ్రాండ్లను పొందారు. MG కార్లను ఒక్కొక్కటి రూ. 38 లక్షలకు కొనుగోలు చేయగా, కియా కార్నివాల్ ఒక్కొక్కటి రూ. 35 లక్షలుగా నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈ చర్యను సహజంగానే ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. పాండిచ్చేరి ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా రుణల పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో విలాస వంతమైన వస్తువులు సమకూర్చడం సరైన పద్దతి కాదు. ప్రభుత్వం పొదుపుచర్యలు తీసుకోవాలి అని ఆయన ప్రభుత్వానికి సూచించారు.