ఏపీ సర్కార్ కు అక్కినేని అభిమానులు వినతి..!

Satvika
ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కొత్త జిల్లాల ను శర వేగంగా ఏర్పాటు చేసెందుకు ప్రభుత్వ అధికారులు కూడా అదే పనిలో నిమగ్నమైయ్యారు. ఇక క్యాబినెట్ కూడా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం కూడా తెలపడం తో ఈ విషయం పై రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల తో వున్న రాష్ట్రం ఇప్పుడు 26 జిల్లాలను చేయాలనీ ఆలొచిస్తుంది. ఈ విభజన పై రాజకీయాల్లో వేడి కొనసాగుతుంది.. ప్రజలకు, రాజకీయ నేత లకు మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే..


ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల కు పేరు పెట్టడం పై డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తో పాటు జిల్లాల పేర్ల విషయంలొనూ అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.. అయితే ఎపి లో ఒక జిల్లాకు తెలుగు అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు పేరు  తెరమీదకు వచ్చింది .మా జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు ఏపి సర్కార్ కు వినతి పత్రాన్ని కూడా అందజెసారని వార్తలు వినిపిస్తున్నాయి..


వివరాలిలా.. జిల్లాలను విభజించిన తర్వాత కొత్త జిల్లా మచలీపట్నం కు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్ధన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టి లో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. గుడివాడ రామపురంలో జన్మించిన  అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రల తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన సినిమా ప్రపంచాన్ని మద్రాసు నుంచి ఏపీకి తీసుకొచ్చారని ఏపీ అక్కినేని అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఈ విషయం పై ఏపి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఈ విషయం పై అభిమానులందరు ఆసక్తి చూపిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: