డ్రగ్స్ : వదల బొమ్మాళీ.. వదల

 
"ఎంతటివారైనా... డ్రగ్స్ విషయంలో వదిలేది లేదు. మీరు ఖచ్చింగా పనిచేయండి. మీ పనులకు ఎవరు అడ్డు వచ్చినా నేను చూసుకుంటా. మీకు పూర్తి స్థాయిలో అధికారాలున్నాయి. వాటిని సక్రమంగా వినియోగించుకోండి. కర్తవ్యనిర్వహణలో కరుకుగా వ్యవహరించండి. తప్పు చేసిన వారిని ఎవరినీ వదలి పెట్టోద్దు".. అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పేర్కోన్నారు.
 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల పూర్తి నియంత్రణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పోలీసు, ఆబ్కారీ సదస్సు జరిగింది. అప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం. హోం, ఆబ్కారీ శాఖల మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్లు హాజరయ్యారు. అధికార పక్షం నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై
సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. పో లీసు, ఎక్సైజ్ శాఖల అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారని కూడా అధికార వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.

మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనే మాటే తెలంగాణ రాష్ట్రంలో వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఇప్పటికి చాలా మార్లు  అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగించినట్లు తేలితే ఎంతటివారైనా కఠినంగా వ్యవహరించాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలు కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలని... రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మందితో కూడిన ప్రత్యేక నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్ కంట్రోల్ సెల్‌ను ఏర్పాటు చేయాలని  కేసిఆర్ ఆదేశించారు. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠినచర్యలు తీసుకునేందుకు ఈ విభాగం.. డీజీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ప్రత్యేక విభాగం ఏర్పాటు, విధివిధానాలు, పనితీరు సహా ఇతర అంశాలపై  ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని అధికార వర్గాల సమాచారం.త్వరలోనే ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: