
చైనాకు షాకిచ్చిన చిన్ని దేశం.. ఇప్పుడు ఏం చేస్తుందో?
తైవాన్ స్వతంత్రదేశంగా గుర్తించడం లేదని తైవాన్ చైనాలో భూభాగం అంటూ చైనా చెబుతుంది. ఇలాంటి సమయంలోనే తైవాన్ ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాము అంటూ అగ్రరాజ్యమైన అమెరికా చెబుతుండటం గమనార్హం. మరోవైపు ఇక చైనాకు శత్రువు దేశాలుగా ఉన్న అన్ని దేశాలు కూడా తైవాన్ నూ గుర్తించేందుకు ముందుకు వస్తూ ఉండడం గమనార్హం. భారత్ కూడా తైవాన్ నూ స్వతంత్ర దేశంగా గుర్తించి ఇప్పటికే పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది.. అయితే గతంలో లిథువేనియా అనే చిన్న దేశం తైవాన్ నూ స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాము అంటూ చెప్పి తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.
ఈ క్రమంలోనే లిథువేనియా తీరుపై గతంలో చైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్లోవేనియా అనేది చిన్న దేశం కూడా చైనాకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము కూడా తైవాన్ నూ స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చింది. తైవాన్ తో అన్ని రకాల ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటీవల స్లోవేనియా స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. స్లోవేనియా ఏకంగా తైవాన్ స్వతంత్ర దేశంగా గుర్తున్నాము అంటూ చెప్పడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.