కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకోవటానికి బూస్టర్ డోస్ అవసరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కీలక అంశాల్ని వెల్లడించారు ప్రముఖ శాస్త్రవేత్త. రోటీన కు భిన్నంగా ఉన్న ఆమె మాటల్ని కాస్తంత వినాల్సిన అవసరం ఉంది.ఎందుకంటే.. బూస్టర్ డోస్ మీద చెబుతున్న ఆమె వ్యాఖ్యల్ని సులభంగా తీసుకోకూడదు.ఎందుకంటే ఆమె ఆషామాషీ మహిళ కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాల్లో బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ తీరు మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి దాకా ఉన్న అంచనాలు.. ఇంకా జరుగుతున్న ప్రచారం ప్రకారం చూసినప్పుడు.. ఆరోగ్యంగా ఉన్న వారికి బూస్టర్ డోసు చాలా అవసరమని అది ఏ పరిశోధనలోనూ తేల్లేదని ఆమె చెబుతున్నారు. ఇక ఆ మాటకు వస్తే.. అసలు బూస్టర్ డోస్ కు సంబంధించి ప్రామాణికమైన ప్రూఫ్ లేదన్నది ఆమె వాదన. కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులు.. తీవ్ర వ్యాధిగ్రస్తులు ఇంకా పెద్ద వయస్కులు అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.
ఇక వైద్య సిబ్బందిని కాపాడటమే లక్ష్యంగా బూస్టర్ డోసును వాడుకోవాలి.అంతేకాని అందరికీ బూస్టర్ డోసులు ఇవ్వకూడదు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఇంకా పెద్దలకు బూస్టర్ డోసు అవసరమని తెలిపే ప్రూఫ్స్ ఏమీ లభించలేదని ఆమె చెబుతున్నారు. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వాదనకు భిన్నంగా ఇప్పటి దాకా కొందరు శాస్త్రవేత్తల వాదన ఏమంటే.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న సమయాన .. గతంలో తీసుకున్న రెండుడోసుల వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయకపోవచ్చని.. రోగనిరోధక శక్తిని మరింత పెంచుకోవటానికి బూస్టర్ డోసు చాలా అవసరమని చెబుతున్నారు.ఇక ఈ నేపథ్యంలో చాలా దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసుల్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అమెరికాలో అయితే మాత్రం పెద్ద వయస్సు వున్న వారు మాత్రమే కాదు 12-15 ఏళ్ల మధ్యనున్న టీనేజర్స్ కు కూడా బూస్టర్ డోసుల్ని ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో బూస్టర్ డోస్ పై వ్యతిరేక గళాన్ని విప్పుతున్నారు శాస్త్రవేత్త్ సౌమ్య స్వామినాథన్. ఇక ఆమె వాదన ప్రకారం చూస్తే..అసలు బూస్టర్ డోసులు ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందన్న అంశంపై మరింత రీసెర్చ్ అనేది జరగాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.