బాబు జిల్లాపై పవన్ ఫోకస్...ఆ సీట్లే టార్గెట్?
ఇలా వైసీపీతో పోరాడుతున్న బాబుకు, పవన్ కల్యాణ్ రూపంలో కూడా తలనొప్పి ఎదురయ్యేలా ఉంది. అది ఎలా అంటే రాయలసీమలో జనసేనకు కాస్త ఎక్కువ ఓట్లు పడిన జిల్లా ఏదైనా ఉందంటే..అది చిత్తూరు జిల్లానే. గత ఎన్నికల్లో కొద్దో గొప్పో చిత్తూరులోనే జనసేనకు ఓట్లు పడ్డాయి. అందుకే ఈ జిల్లాలో ఇంకా ఎక్కువ బలపడాలని పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో బలపడితే జనసేనకు కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎలా ఉంటే..ఒకవేళ టీడీపీతో గాని పొత్తు ఉంటే జనసేనకు రెండు, మూడు సీట్లు అడిగే అవకాశం ఉంటుంది.
ఒకవేళ పొత్తు లేకపోతే జనసేన వల్ల టీడీపీకే డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఎటు వచ్చిన ఇక్కడ టీడీపీకే నష్టం. టీడీపీకి వచ్చే నష్టం ఏమో గానీ...ముందు జిల్లాలో బలం పెంచుకోవాలని జనసేన మాత్రం ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతి, పుంగనూరు, పలమనేరు లాంటి స్థానాల్లో కాస్త బాగానే ఓట్లు తెచ్చుకుంది. పైగా నెక్స్ట్ పవన్ సైతం తిరుపతిలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే చిత్తూరులో జనసేన ప్రభావం కాస్త ఉంటుంది. అలాగే పొత్తు ఉంటే కొన్ని సీట్లు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి బాబు సొంత జిల్లాలో పవన్ కల్యాణ్ ఏ మేర సత్తా చాటగలరో.