పోలీసుల పై కరోనా పంజా..!

Satvika
కరోనా మహమ్మరి నుంచి ప్రజలను కాపాడటానికి పోలీసులు ప్రత్యేక పాత్రను పొషించారు. ప్రజలకు కరోనా పై అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు కఠిన చర్యల ను తీసుకున్నారు.. అందులో భాగంగా చాలా మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.. కొందరు మాత్రం మహమ్మరి చేతి లో ప్రాణాల ను కూడా కొల్పొయారు. ఇప్పటికీ మహమ్మరి విజ్రుంభిస్తున్న కూడా ముందుండి జనాల ను కాపాడుతున్నారు. అయితే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అత్యంత శక్తివంథంగా మారింది. ఇప్పుడు ఇది పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారింది.



తెలంగాణా లో చాలా మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.. ఇప్పటికే తెలంగాణా పోలీసులు 650 మందికి కరోనా సోకింది. హైదరాబాదు, సికింద్రాబాదు లోని మూడు కమిషనరేట్లతో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి దీని కాటు తప్పలేదు. క్రిమినల్స్, పోలీసు కేసు పెట్టడానికి వచ్చిన వారి ద్వారా నో కరోనా సోకుతుండటం తో పోలీసు కుటుంబాలు భయం తో వణికిపోథున్నారు.. ఇలా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపిస్తోంది..



ట్రాఫిక్‌ పోలీసులైతే డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంతున్నారు. సరూర్‌ నగర్‌ లోని పోలీసు స్టేషన్ లలో చాలా మందికి కరోనా సొకిందని అధికారులు చెబుతున్నారు.. వ్యాక్సిన్ తీసుకున్న అధికారులకు కూడా మహమ్మరి వ్యాపిస్తున్న నేపథ్యంలోనే అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే అధికారులను ఆసుపత్రి కి తరలించారు..

అధికారులు, సిబ్బంది వైరస్‌ బారినపడుతుండటంతో ఉన్నతాధికారుల్లో భయం నెలకొంది. ఎవరికీ తీవ్రమైన ఇబ్బందులు లేకున్నా క్వారంటైన్‌ తో వున్న అధికారులు ఎక్కువ కావడంతో డ్యూటీ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇక ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకుంటూందో చూడాలి.. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్న నేపథ్యంలో జనాలు భయంతో వణికిపోథున్నారు.. ఇప్పటి వరకు కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: