వ్యాక్సిన్ తీసుకోకపోతే.. ఆ ట్యాక్స్ కట్టాల్సిందే..!

NAGARJUNA NAKKA
కరోనా సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ వల్ల భారత్ లో 2లక్షల 40వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడయింది. ఆర్థికంగానూ భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది. రానున్న కాలంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. వ్యాక్సినేషన్ ను సమర్థంగా చేపట్టే వరకు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్క్ ను 8గంటలు ఒక సారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.
ఇక మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలు ప్రజలను కోరుతున్నాయి. అయినా కొందరు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే అలాంటి వారిపై హెల్త్ ట్యాక్స్ విధిస్తామని కెనడాలని క్యూబెక్ ఫ్రావిన్స్ ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో స్థానిక ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు క్యూకట్టారు. నిత్యం లక్ష మంది టీకా తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
దేశీయ టీకా కొవాగ్జిన్ ఇకపై చిన్నారులకు, పెద్దవాళ్లకు ఇచ్చే యూనివర్సల్ వ్యాక్సిన్ గా అవతరించిందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కరోనా కట్టడికి కొవాగ్జిన్ గ్లోబల్ వ్యాక్సిన్ గా తయారు చేయాలన్న తమ కష్టం ఫలించిందని పేర్కొంది. వ్యాక్సిన్ లైసెన్సుకు కావాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని సంస్థ తెలిపింది.
మరోవైపు లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీలు చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది.
మన దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24గంటల్లో 2లక్షల 64వేల 202 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటితో పోలిస్తే 6.7శాతం ఎక్కువ. నిన్న 315మంది మహమ్మారికి బలయ్యారు. తాజాగా లక్షా 9వేల 345మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 12లక్షల 72వేల 73యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 14.78శాతంగా ఉంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5వేల 753కి పెరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: