ఎన్-95 మాస్క్ లను ఎన్నిసార్లు వాడాలి.. ఇది తెలుసుకోండి?
మాస్క్ పెట్టుకోకుండా బయటికి అడుగు పెడితే ఇక చేతులారా మన ప్రాణాలను మనమే తీసుకున్నట్లు అవుతుంది అని భావిస్తూ ఎంతోమంది మాస్క్ ను రోజువారి జీవితంలో తప్పనిసరిగా మార్చుకున్నారు. ఇలా మనిషి ప్రాణాలను కాపాడే మాస్క్ విషయంలో కూడా ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందో లేదో అప్పుడే మార్కెట్లోకి ఎన్నో రకాల మాస్క్ లు అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఏ మాస్క్ కొంటే బెటర్ అనే దానిపై అనుమానాలు ఉండగా n95 మాస్క్ కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఎంతోమంది సూచించారు. ఇక ఈ మాస్క్ ఖరీదు కాస్త ఎక్కువైనా ఈ మాస్క్ వాడి ప్రాణాలు కాపాడుకుంటున్నారు ఎంతోమంది.
అయితే n95 మాస్క్ వాడటం వరకు బాగానే ఉంది. కానీ మాస్క్ ను మళ్లీ శుభ్రం చేసి ఉపయోగించే అవకాశం మాత్రం లేదు. దీంతో నిర్దిష్ట కాలం పాటు వాటిని ఉపయోగించడం ఆ తర్వాత చెత్తకుప్పలో పడేయడం చేయాల్సిందే. అయితే n95 మాస్క్ ను ఎన్ని సార్లు ఉపయోగించాలి అనే విషయంపై మాత్రం ఎంతోమంది లో అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఈ పద్ధతిలో భాగంగా n95 మాస్క్ ఏకంగా 25 సార్లు శుభ్రం చేసి మళ్లీ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాటి సామర్థ్యం కూడా ఎక్కడా తగ్గదట. అమెరికాలోని బెత్ ఇజ్రాయిల్ డికోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు వేపరైస్డ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తెరమీదకు తీసుకువచ్చారు. ఇంతకీ ఇది ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇది ఒక క్రిమినాశక రసాయనం. దీని సహాయంతో n95 మాస్క్ లను శుద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.