ప్రపంచమంతా మరో సారి
కరోనా ఊబిలో మునుగుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తన
పంజా విసురుతూ వ్యాప్తిని కొనసాగిస్తోంది. గతంలో
కరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ లు ముగియగా, ఇపుడు మనం ఎదుర్కొంటున్నది థర్డ్ వేవ్ నే అని అంటున్నారు పలువురు వైద్య నిపుణులు. అప్పట్లో కొందరు శాస్త్రజ్ఞులు, వైద్యులు
జనవరి మొదటి వారంలో
కరోనా మూడవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుపగా ఇపుడు ఆ సూచనలే కనబడుతున్నాయి. అనుమానమే లేదు ఇది
కరోనా థర్డ్ వేవ్ అని అంటున్నారు. గత వారం రోజులుగా
కరోనా కేసులు లక్షలలో పెరుగుతూ వస్తున్నాయి.
కరోనా వంటి సాంక్రమిక వ్యాధులు అనగా వైరస్ ల వ్యాప్తి రేటుపై అంచనాకు వచ్చేందుకు 'ఆర్-నాట్ వ్యాల్యూ' ను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తికి వైరస్ సోకితే అతడి నుండి ఎంత మందికి వైరస్ సోకుతుంది అన్నది బట్టి ఆర్ నాట్ వ్యాల్యు నిర్ధారించడం జరుగుతుంది. అయితే తాజాగా ఐఐటీ మద్రాస్ విశ్లేషణను బట్టి చూస్తే.. ప్రస్తుతం దేశంలో ఆర్-నాట్ వ్యాల్యూ 4 అని తెలుస్తోంది. అంటే.. కొవిడ్ సోకిన ప్రతి ఒక వ్యక్తి నుంచి సగటున నలుగురికి వైరస్ సోకుతుంది అన్న మాట. దీన్ని బట్టి ఇది
కరోనా థర్డ్ వేవ్ నే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే
కరోనా ఇలా బీభత్సం సృష్టిస్తున్న తరుణంలో
కరోనా వ్యాప్తి, పరిణామాల్ని అంచనా వేసేందుకు
ప్రధాని మోదీ 'జాతీయ కొవిడ్ సూపర్ మోడల్ కమిటీ' అనే కమిటీని కోవిడ్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కమిటీకి ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యాసాగర్ హెడ్ గా ఉండగా...ఆయన తాజాగా ప్రస్తుత
కరోనా థర్డ్ వేవ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో
కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది మాట నిజమే కానీ... దాని కారణంగా ఇది చాలా మందిలో తీవ్ర ఇన్ఫెక్షన్ ను కలిగించడం లేదు ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన ఊరట కలిగించే అంశాలను తెలియచేశారు.