వినుకొండ ఎమ్మెల్యే కథ వినండహో! ఆడంతే అదో టైపు!

RATNA KISHORE
భిక్షాపాత్ర‌లో కొన్ని మెతుకులు క‌ద‌లాడుతాయి..కొన్ని క‌న్నీళ్లు క‌ద‌లాడుతాయి..క‌న్నీటి రాత‌లు చెదిరాక జీవితంలో తుఫానులు.. తుఫానులు దాటాక ఇదిగో ఎన్నో అవ‌మానాలు.. రైత‌న్నా!  నీకు మా త‌ర‌ఫున క్ష‌మాప‌ణ‌లు..ఆడిని ఆ..దేవుడు కూడా క్ష‌మించ‌డులే!
 
అత‌డు దేవుడు..న‌డిచే దేవుడు..పాదపూజ చేయాలి..నేల త‌ల్లి పొత్తిళ్ల నుంచి ఉద‌యించిన దేవుడు..అత‌డికి గుడి వ‌ద్దు.. గుండెల్లో స్థానమూ వ‌ద్దు..క‌నీస గౌర‌వం కావాలి..నేలను ముద్దాడే పాదాల‌కు ఎన్నో గాయాలు..వాటితో పాటు అవ‌మానాలు .. దేనిన్రా దాటుకుని రావాలి..ఎవ‌డ్రా! ఆ ఎమ్మెల్యే..ఇది రౌడీ రాజ్య‌మా లేదా రాజ‌న్న రాజ్య‌మా..అడిగితే పోలీసు వాహ‌నంలో రౌడీల‌ను పంపుతాండేమో ఆ ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌న్న.. ఏం చేయలేం.. ఎవ్వ‌రినీ నిలువరించ‌లేం..ఇది రా దేవుడి పాల‌న దెయ్యాల గ‌ర్జ‌న వినండ్రా!
 


పంట చేతికివ‌చ్చే వేళ  ప్ర‌స‌వ వేద‌న
పుడ‌మి నుంచి విత్తు విచ్చుకున్న వేళ
అనంత వేద‌న..ఆదుకోవాల్సిన నాయ‌కుడు
క‌త్తి ప‌ట్టినంతగా క‌త్తిగడ్తాడు
చెప్పందుకుని రైతుపైకి దూసుకుని వ‌స్తాడు
ఇదేమ‌ని అడిగితే..మీకు భ‌రోసా కావాల్రా భ‌రోసా అని
నోటికి వ‌చ్చిందంతా తిడ్తాడు..
ఇదీ! దేవుడి పాల‌న‌లో
దెయ్యాల వేదాల వ‌ల్లింపు



బ్ర‌హ్మ‌న్న అంటే ఎవర్రా..వినుకొండ ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌న్న అంటే ఏమ‌నుకున్నార్రా.ఆయ‌న సీఎం తరువాత సీఎం.ఆయనేం అంటే అదే అవుతుంది.ఆయన రైతును చెప్పుతో కొట్ట‌డానికి ప‌రుగులు తీశాడే అనుకో మ‌నం చూస్తూ ఉండిపోవాలి..లేదా ఆయ‌న గారి వెంట పరుగులు తీసి,అదేంటి స‌ర్..మీరు చెప్పు తీశారు..క‌త్తి అందుకుని పీక న‌రికేయండి అని చెప్పాలి.అంత‌టి స్థాయిలో ఓ సాధార‌ణ రైతుపై,సొంత పార్టీ  కార్య‌క‌ర్త కూడా అయిన ఓ సామాన్యుడిపై ఓ ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జ‌న్యం చూసి మ‌నం  ఏమీ తెలియ‌ని విధంగా నిశ్చేష్టులుగా ఉండిపోవాలి..నిరాశ‌తో మిగిలిపోవాలి..క‌న్నీళ్లు మింగి న‌వ్వులు తేల్చాలి..వెర్రి న‌వ్వుల చెంత ఆ ఎమ్మెల్యే మ‌న నుంచి నిష్క్ర‌మించి వెళ్తాడు.ఇదిరా! ప్ర‌జా స్వామ్యం అంటే! కొట్టండ్రా డ‌ప్పు! తీయండ్రా బ‌ళ్లు!


అయ్యా!మాకు భ‌రోసా కావాలి  అంటే ధాన్యం కొనుగోలు చేశాక నాలుగు డ‌బ్బులు వెనువెంట‌నే జ‌మ కావాలి...అందుకు ఆల‌స్యం అన్న‌ది ఉండ‌కూడ‌దు అని ఓ సాధార‌ణ రైతు న‌రేంద్ర..న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయలుకి మొర‌పెట్టుకుంటే,గుంటూరు జిల్లా, వేల్పూరు గ్రామానికి వ‌చ్చిన సంద‌ర్భంగా త‌న గోడు విన్న‌వించుకుంటూ ఉంటే, పక్క‌నే ఉన్న ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌న్నకు స‌ర్రున కోపం వ‌చ్చింది.స‌మ‌స్య ప‌రిష్క‌రించేందుకు ఎంపీ ఓ వైపు జిల్లా ఉన్న‌తాధికారి(జేసీ)తో మాట్లాడుతుంటే, అయ్యాగారికి వీరావేశం వ‌చ్చింది.. ధాన్యం కొనుగోలు స‌మ‌స్య గ్రామంలో ఉంది..మీరు మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించినా ఇక్క‌డ రైతు భ‌రోసా కేంద్రాలు స‌రిగా ప‌నిచేయ‌డం లేదు.. అని చెప్పినందుకు రైతు న‌రేంద్ర విల‌న్ అయ్యాడు.అంతే!  ధాన్యం కొనుగోలు చేశాక  నాలుగు డ‌బ్బులు ఇవ్వాల్సిన బాధ్య‌త ఎవ‌రిది? ప్ర‌భుత్వానిదే క‌దా! మీరు ఎప్పుడు డ‌బ్బులు వేయించ‌గ‌ల‌రు? మా డ‌బ్బుకు భ‌రోసా ఏంటి? అని ఆ రైతు నిల‌దీసిన పాపానికి చెప్పు అందుకుని రైతు మీద‌కు వ‌చ్చాడు..దాడి చేయ చూశాడు..ఆ..ఎమ్మెల్యే!  ఆఖరికి ఆ రైతు తిర‌గ‌బ‌డితే చేసేదేం లేక పోలీసుల‌కు ఆయ‌న‌ను అప్ప‌గించి క‌సితీరా కొట్టించాడు ఆ..ఎమ్మెల్యే..! అది రా! దేవుడి పాల‌న అంటే..అది రా! ఎమ్మెల్యే బ్ర‌హ్మ‌న్నంటే..వినుకొండ‌లో ఇలాంటి వికృతాలు గ‌తంలో ఉన్నాయో లేవో కానీ..ఇంత‌టి ఘోరం ఇక‌పై ఊహించ‌వ‌ద్దు.

ఏమ‌నుకుంటున్నార్రా!మీరంతా ఒక‌డేమో రౌడీలు అంటాడు..ఇంకొక‌డేమో నోటికి వ‌చ్చిందంతా తిడ‌తాడు..మ‌రొక‌డు చెప్పు అందుకుని కొట్టడానికి బ‌య‌లుదేరుతాడు..ఇంకొక‌డు చ‌ట్ట స‌భ‌ల్లో మీసం మెలేస్తాడు.అవున్రా! మీరేమ‌యినా స‌మ‌ర సింహారెడ్లు, న‌ర‌సింహ నాయుడ్లు  అనుకుంటున్నార్రా..క‌నీసం మీకు ఇంగితం ఉండ‌క్క‌ర్లే..అన్నం పెట్టే రైత‌న్న‌ను చూసే క్ర‌మం ఇదేనా! ఆదుకునే క్ర‌మం ఇదేనా! త‌గ్గండ్రా త‌గ్గండి! త‌క్ష‌ణం క్ష‌మాప‌ణలు చెప్పండి !  

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp

సంబంధిత వార్తలు: