ట్రోల్ వ‌ర్డ్ : వ‌న‌మా రాఘ‌వ

RATNA KISHORE
మంచి,చెడు అనే రెండు ల‌క్ష‌ణాల ద‌గ్గ‌ర
ఎవ‌రి ప్రపంచం వారిది ఎవ‌రి నిర్ణ‌యాలు వారివి
ఒక నాయ‌కుడి మంచి గురించి చెప్పాలి
అదే విధంగా నియంతృత్వం గురించి త‌ప్ప‌క ప్ర‌శ్నించాలి
ఇవేవీ లేకుండా రాజ‌కీయం న‌డుపుతామంటే ఎలా?

అధికారం ఉంటే ఏమ‌యినా చేయొచ్చు..అందులో గులాబీ దండుకు చెందిన మ‌నిషి..ఎవ్వ‌రినైనా బ‌లాత్క‌రించ‌వ‌చ్చు..ఎవ్వ‌రిపై అయినా బ‌లం ప్ర‌యోగించ‌వ‌చ్చు..ముక్కు పచ్చ‌లార‌ని చిన్నారి మ‌ర‌ణానికి కార‌ణం అయినా కూడా ఎవ్వ‌రూ మాట్లాడ‌కూడ‌దు.

మ‌రో బిడ్డ ఆస్ప‌త్రి గోడ‌ల మ‌ధ్య చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్నా అడ‌గ‌వ‌ద్దు..ప్ర‌శ్నించ‌వ‌ద్దు..అస్స‌లేం అయిందో మీకూ తెలియ‌దు మ‌రియు మీడియాకూ తెలియ‌దు..పోలీసుల‌కు అస్స‌లు తెలియ‌దు..రాజ్యంలో స‌మాంతర ప్ర‌భుత్వాలు న‌డుస్తుంటే ఏం చేస్తున్నార‌ని?
తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తున్న వ‌న‌మా రాఘ‌వ అరెస్టు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు మాత్రం ఇంకా చాలానే ఉన్నాయి అని ఇంత‌కాలం పోలీసులు మొద్దు నిద్ర న‌టించార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.ఈ త‌రుణంలో ఆయ‌న అరాచకాల‌పై  పోలీసులు దృష్టి సారించాల‌ని చాలా మంది బాధితులు వేడుకుంటున్నారు.ఈ విష‌య‌మై కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేయించాల‌ని విప‌క్ష స‌భ్యులు ప‌ట్టుబ‌డుతున్నారు.బీజేపీ ఇప్ప‌టికిప్పుడు రాజ‌కీయ ల‌బ్ధి కోసం మాట్లాడినా రేప‌టి వేళ కూడా ఇదే ప‌ట్టుద‌ల‌తో ఉండి బాధితుల త‌ర‌ఫున మాట్లాడ‌గ‌లిగితే మంచిది.ఓ సామాన్యుడి కుటుంబాన్ని బ‌లి తీసుకున్న వైనంపై కేసీఆర్ సీరియ‌స్ గానే ఉన్నా ఎమ్మెల్యే వ‌న‌మాపై ఎటువంటి చ‌ర్య‌లు ఎందుకు లేవు..అంటే ఆయ‌న‌కు తెలియ‌కుం డానే ఇన్నాళ్లుగా కొడుకు రెచ్చిపోయి దందాలు చేస్తున్నాడా? అయితే వాటిని పోలీసులు చూసీచూడ‌ని విధంగా వ‌దిలేశార‌ని కూడా

వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై సంబంధిత శాఖ ఇప్ప‌టికైనా అంత‌ర్గ‌త ద‌ర్యాప్తుకు ఆదేశించాల్సి ఉంది.ఒక ఎమ్మెల్యే కొడుకు ఇన్ని ఏళ్లుగా ఏక‌ఛ‌త్రాధిప‌త్యం వ‌హిస్తుంటే పోలీసులు ఎలా క‌ళ్లు మూసుకున్నార‌ని బీజేపీ అడుగుతోంది.నిల‌దీస్తోంది.ఇప్ప‌టికైనా గులాబీ బాస్ త‌న స్వార్థం వీడి ఎమ్మెల్యే  కొడుకు అరాచ‌కాల‌న్నింటినీ నిలువరించి ఓ గొప్ప ముఖ్య‌మంత్రిగా పేరు తెచ్చుకోవాల‌ని కూడా విప‌క్షం వేడుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: