పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి : దృక్పథాలు కొన్ని..అవసరాలు కొన్ని కానీ???
అవసరాలు ఏం నిర్దేశిస్తాయి
అవసరం ఏ విధంగా ఎందుకు?
రాజకీయ అవసరం వ్యక్తి ఉన్నతికి
సామాజిక దృక్పథం వ్యవస్థ ఎదుగుదలకు
తార్కాణం.. అండ్ ద టైటిల్ ఈజ్
పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి
సామాజిక దృక్పథం / రాజకీయ దృక్పథం..సత్యం ఒకటి స్వప్నం ఒకటి..రాజకీయంగా ఎదగాలనుకోవడం స్వప్నం..తోటి వారికి సాయం అందించడం సత్యం..సత్యానికి దూరంగా జీవించడం అత్యంత బాధాకరం..ఓ సంఘజీవికి ఇంతకుమించిన అవమానం ఇంకొకటి ఉండదు కూడా! దుఃఖాన్ని వెలివేసేందుకు చేసే ప్రయత్నంలో ప్రజా జీవితాలను మార్పు చేసే క్రమంలో మంచి దిశగా నడిపించేందుకు ఒక రాజకీయ వేత్త నిబద్ధాక్షరి కావాలి..అందుకు ప్రామాణికం ఈ పొలిటికల్ సైన్స్ విత్ శంభుమహంతి కావాలి..అన్నదొక ప్రతిపాదన.ఆచరణ సాధ్యతతో కూడిన ఆశారేఖ కూడా!
టేక్ ఎ మూమెంట్
నినాదం ఒకటి కావాలి
మనుషుల్లో ఇంతటి విజ్ఞత ఇంతటి ప్రభావశీలక ధోరణి ఉన్నాయా? అని అనుకుంటూ వెళ్తాను.ప్రజా జీవితాలను ప్రభావితం చేసే పొలిటికల్ సైన్స్ ఏం నేర్పింది ఏం నేర్పుతోంది అన్నవి ప్రధాన భూమికలు..అయినా మనం ఎక్కడో ఆగిపోయి జీవితాన్ని తిట్టుకుంటున్నాం..ఎక్కడో ఆగిపోయి ఎవ్వరూ మనకు చేయందించడం లేదని బాధపడుతున్నాం.. ఉన్న సంస్థలు ఏం చేస్తున్నాయి.. రాజకీయ ఐక్య వేదికలు ఎందుకు? ఇదే ప్రశ్న నిన్నటి వేళ కిల్లి కృపారాణిని అడిగాను..
ఏ సంస్థకు అయినా సామాజిక దృక్పథమే ఉండాలి..రాజకీయ దృక్పథం కాదు.. అని పదే పదే చెప్పాను..నాతో ఏకీభవిస్తూ ఏ సంస్థ అయినా సామాజిక దృక్పథంతోనే ఉండాలి..పని చేయాలి కానీ పొలిటికల్ బార్గైనింగ్ ఎందు కు అని మళ్లీ మళ్లీ అడిగాను...రాజకీయ అవసరత దృష్ట్యా ఏర్పడే వేదికల గురించి పదే పదే అడిగాను. ప్రస్తుతం నా దృష్టిలో లేవు అని చెప్పారామె..ఏ సంస్థకు అయినా మీరు చెప్పిన విధంగా ఆ కులంలోనో లేదా ఆ... సమూహంలోనో దిగువ స్థాయిలో ఉన్నవారిని ఆదుకోవడం మంచిదే! ఐక్య వేదికలు అన్నవి కులాల కుంపట్లు అని ఎందుకు అనుకోవాలి.. అదొక స్పృహ మాత్రమే అని అన్నారామె.