మంత్రి పదవి రేసులో ప్రజలు మెచ్చిన యంగ్ ఎమ్మెల్యే... ?
తెలుస్తున్న సమాచారం ప్రకారం కొద్ది రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మరోసారి జగన్ కు ఛాలెంజింగ్ గా మారేలా ఉంది. రెండవ కేబినెట్ విస్తరణలో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే జగన్ మాత్రం ఆయా ఎమ్మెల్యేల పనితీరును పరిగణలోనికి తీసుకుని విస్తరణ చేస్తాను అని మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ లిస్ట్ లో కొంత మంది పేర్లు వినిపిస్తున్నా, ఇప్పుడు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం యువ ఎమ్మెల్యే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతను ఎవరో కాదు యువ నాయకుడు కేతిరెడి వెంకటరామిరెడ్డి.
తన నియోజకవర్గంలో కేతిరెడ్డి ప్రజలకు చేస్తున్న సేవ గురించి రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. ప్రతి రోజూ కేతి రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి, అందరికీ అందుతున్నాయా లేదా అధికారులు ఏమైనా పొరపాటు చేస్తున్నారా అని అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారం చేస్తున్నారు. ఈ విధానం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. ఇప్పుడున్న కాలంలో ప్రజలే నేరుగా వెళ్లి ఎమ్మెల్యేకు తమ సమస్యల గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోని రోజుల్లో, ఒక ఎమ్మెల్యే ఇలా ప్రజల వద్దకే వెళ్లి సేవ చేయడం అందరికీ చాలా బాగా టచ్ అయింది. సామాజిక సమీకరణాలు అన్నీ పక్కన పెడితే నెక్స్ట్ చేయబోయే కేబినెట్ విస్తరణలో కేతీరెడ్డి పేరు తప్పక ఉంటుందని ప్రజలు అభిమానులు ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.