చైనాకు షాక్.. అక్కడ నిషేధం?
ఇలా చైనా నుంచి పాకి పోయిన కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ ప్రపంచ దేశాలను ఇప్పటికే సంక్షోభం లోకి నెట్టింది. ఎన్నో చిన్న దేశాలు అయితే దీన స్థితిలోకి వెళ్లిపోయాయని చెప్పాలి. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడిప్పుడే వైరస్ బారి నుంచి బయట పడుతున్నాయి. ఇలాంటి సమయంలో సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను భయ పెడుతుంది. అయితే చైనాలో నుంచి ప్రపంచానికి పాకి పోయినా ఈ కరోనా వైరస్కు ఇన్నాళ్లకు పుట్టింటి మీద ప్రేమ వచ్చినట్లు మరో సారి చైనాలో విజృంభించడం మొదలు పెట్టింది.
దీంతో చైనా ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి భారీగా కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో ఎన్నో ప్రాంతాలు లాక్డౌన్ లో కి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఎన్నో ప్రాంతాల లో కఠినమైన లాక్ డౌన్ విధించి ప్రజలు ఇంటికే పరిమితం చేసింది చైనా ప్రభుత్వం. ఇప్పుడు 1.2 మిలియన్ల ప్రజలు ఉన్నటువంటి యూజా హో లో నిషేధాజ్ఞలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం. కేవలం మూడు కేసులు వెలుగు లోకి వచ్చినందుకు పది రోజుల పాటు పూర్తిగా అక్కడి నగరం పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.