కోవిడ్ అంటే కరోనా కాదు.. మనిషే?
అయితే మొదట్లో కోవిడ్ పేరుతో ఇతనికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త లేదు. కానీ ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలు కరోనా వైరస్ అందరిని పట్టి పీడించడం మొదలు పెట్టిందో.. శాస్త్రవేత్తలు ఎప్పుడైతే దీనికి కోవిడ్ అని పేరు పెట్టారో అప్పటి నుంచి కోవిడ్ కపూర్ కి సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ట్విట్టర్ వేదికగా సదరు వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్ గా మారిపోయింది నా పేరు కోవిడ్ నేను వైరస్ కాదు అంటూ ఒక ట్వీట్ పెట్టాడు. అంతేకాదు కోవిడ్ అనే పేరు ఉండటం కారణంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా ఇటీవలే చెప్పుకొచ్చాడు.
తాను విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది తన పేరుపై రకరకాల జోకులు కూడా వేసుకుంటున్నారు. ఇక నాపై ఇతరులు వేసే జోకులు నేను కూడా ఆస్వాదిస్తున్నాను అంటూ చెబుతున్నాడు సదరు వ్యక్తి. దీంతో భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి నపుడల్లా తన పేరు తనకి ఒక ఎంటర్టైన్మెంట్ గా మారి పర్యటన మొత్తం సరదా సరదాగా సాగిపోతుంది అంటూ చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కోవిడ్ అనే పేరుకి అర్థం పండితుడు లేదా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని హనుమాన్ చాలీసా లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా కోవిడ్ అనే పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలిసి మాత్రం అందరూ ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.