భారత్ కి వచ్చిన రెండు దేశాలు.. అమెరికాకు షాక్?
ఎన్ని రోజుల వరకు కేవలం అగ్రరాజ్యాలకు మాత్రమే సాధ్యమైన ఆయుధ వ్యాపారంలోకి అడుగు పెట్టి ప్రస్తుతం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ అగ్రరాజ్యాల కి షాక్ ఇస్తోంది భారత్. భారత్ తయారుచేసిన క్షిపణి వ్యవస్థ లను కొనుగోలు చేయడానికి ప్రస్తుతం ఎన్నో చిన్న దేశాలు ముందుకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం drdo శాస్త్రవేత్తలు తయారు చేసిన అద్భుతమైన ఆవిష్కరణల్లో బ్రహ్మోస్ క్షిపణి ఒకటి. ఇప్పటికే విదేశాలకు చెందిన ఎంతో మంది రక్షణ రంగ నిపుణులు భారత్ కు వచ్చి బ్రహ్మాస్మి మిస్సైల్ కు సంబంధించిన ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో భారత ఆయుధాల వ్యాపారం బ్రహ్మోస్ మిస్సైల్ కారణంగానే జరగబోతుంది అనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అర్థమవుతుంది.
ఇక ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు రెండు దేశాలు ముందుకు వచ్చాయి. వియత్నాం, ఫిలిఫైన్స్ దేశాలు బ్రహ్మోస్ క్షిపణి కోసం భారత్కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఇక బ్రహ్మోస్ మిస్సైల్ కి సంబంధించిన చర్చలు సక్సెస్ కావడంతో ఇక ఆయా దేశాల బడ్జెట్ లో కూడా భారత్ నుంచి బ్రహ్మోస్ మిస్సైల్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే చిన్న దేశాలకు ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యాలు మొండికేస్తున్న వేళ భారత్ ఇక దానిని క్యాష్ చేసుకుంటూ ఆయుధ వ్యాపారాన్ని మరింత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళుతుంది అనడానికి ఇదే నిదర్శనం గా మారింది అని అంటున్నారు విశ్లేషకులు.