కరోనా తర్వాత 2022 లో జరిగేదిదే... బ్రహ్మం గారే ప్రూఫ్?

VAMSI
మన భారత దేశంలోని ప్రజలు సంస్కృతి సంప్రదాయాలకు ఎంత విలువిస్తారో జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అంతే విశ్వసిస్తారు. గ్రహ బలాలు, నక్షత్రాలు ఇలా అన్ని ఖగోళ గణాంకాలను బాగా నమ్ముతారు. అదే విధంగా భవిషత్తును గూర్చి తమ దివ్య జ్ఞానంతో తెలియచేసే మహా జ్ఞానులను సైతం అంతే నమ్ముతారు. అయితే మన దేశంలో  శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తు లో ఏం జరగబోతుంది అన్నది ముందే తమ దివ్య జ్ఞానంతో తెలిపారు. ఆ వివరాలు అన్నీ కాలజ్ఞానంలో ఉన్నాయి. అయితే వీరబ్రహ్మం గారు చెప్పిన దాదాపు చాలా విషయాలు నిజమయ్యాయి. 


అందుకే వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానంపై  ప్రజలకు అపారమైన విశ్వాసం. కాగా ఈ కరోనా మహమ్మారి గురించి కూడా బ్రహ్మం గారు ముందే చెప్పారట... బ్రహ్మం గారు క్రీ.శ. 1622 లో జీవించి ఉండేవారు. ఆయన జీవిత కాలమంతా ఊరూరా తిరుగుతూ కాలజ్ఞానం గురించి, భవిష్యత్తు గురించి ఆయన ప్రజలకు వినిపించే వారు. అయితే ఆయన కాలజ్ఞానంలో కరోనా వైరస్ విషయం కూడా ఉందట, అంతేకాక ఈ మహమ్మారి ఒక్కరితో సమస్య అంతం అవదని ఇంకా చాలా అవాంతరాలు ఉన్నాయని ఆయన తెలిపినట్లు కాల జ్ఞానంలో ఉంది. ఇపుడు ఆ వివరాలు గురించి తెలుసుకుందాం.

కరోనా తరువాత ఈ విషమ పరిస్థితులు ఇంతటితో ఆగిపోవని ఇంత కన్నా గడ్డు కాలాన్ని మనుషులు చూడాల్సి, అనుభవించాల్సి ఉంటుందని ఆయన తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అదే విధంగా కరోనా తగ్గుతోంది అనుకునే లోపు ఇపుడు ఒమిక్రాన్  వేరియంట్ వచ్చిపడింది. ప్రస్తుతం భారత దేశంలో కూడా వ్యాప్తి అధికమవుతోంది. బ్రహ్మం గారు చెప్పిన ప్రకారం చూస్తే ఈ కొత్త వేరియంట్ వలన కూడా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగింది చాలు ఇకనైనా మానవులపై కరోనాకు కనికరం కలగాలని అంతా క్షేమంగా ఉండాలని కోరుకుందాం, అలాగే అప్రమత్తంగా ఉందాం. దీని తర్వాత ఇంకా ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: