గోదావరి : కాపుల పార్టీకి చిరంజీవి, పవనే మైనస్సా ?
చదవటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా వాస్తవమైతే ఇదే. కాపులకు రాజ్యాధికారం రావాలంటే కాపులే కొత్తగా పార్టీ పెట్టుకోవాలనే వాదన వినిపిస్తోంది. ఇందుకోసం కాపుల్లోని ప్రముఖులు కొందరు హైదరాబాద్ లో సమావేశమయ్యరని, ఖమ్మంలోను, కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి పండగకు ముందు విశాఖపట్నంలో సమావేశమవ్వబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అయితే ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎంతమంది హాజరైనా కాపులకు ప్రత్యేకించి కొత్తపార్టీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే గతంలోనే చిరంజీవి హయాంలో ప్రజారాజ్యం పేరుతో ఒక ప్రయోగం జరిగి ఫెయిలైంది. అలాగే ఇపుడు జనసేన రూపంలో పవన్ కల్యాణ్ చేసిన ప్రయోగం కూడా ఫెయిలైనట్లే. వీళ్ళద్దరి హయాంలోనే కాపులకు ప్రత్యేక పార్టీ అనే ప్రచారం జరిగినా ఫెయిలయ్యారంటే భవిష్యత్తులో ఎవరు ప్రయోగాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని కాపుల్లోనే చాలామంది గట్టిగా నమ్ముతున్నారు.
మొదటి చిరంజీవి విషయం చూస్తే ప్రజారాజ్యంపార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండుంటే 2014 ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చుండేవని ఇప్పటికీ కాపు ప్రముఖులు గుర్తుచేసుకుంటారు. చిరంజీవిని నమ్ముకుని పార్టీలో చేరిన కాపులు+నాన్ కాపుల్లో చాలామంది దారుణంగా దెబ్బతిన్నారు. వ్యక్తిగతంగా చిరంజీవి వరకు ఫుల్లు హ్యాపీ. పార్టీలో చేరిన వాళ్ళు, ఓట్లేసిన వారే దెబ్బతిన్నారు.
అలాగే పవన్ విషయానికి వస్తే పార్టీ పెట్టిందగ్గర నుండి చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారనే నెగిటివ్ ప్రచారం జనాల్లో బలంగా నాటుకుపోయింది. పవన్ వైఖరితో అదే నిజమని జనాలకు కూడా అర్ధమైపోయింది. 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ తనకు ఓట్లేసి గెలిపించమని అడక్కుండా జగన్మోహన్ రెడ్డిని సీఎం కానీయనంటు శపథాలు చేశారు. తనకు ఓట్టేసి గెలిపించమని అడగకుండా జగన్ కు ఓటయ్లేయద్దని పవన్ చెప్పటమేంటో జనాలకు మొదట్లో అర్ధంకాలేదు. తర్వాత పవన్ పనిచేస్తున్నది చంద్రబాబు కోసమే అని అర్ధమైపోయింది.
అంటే అప్పుడు చిరంజీవి అయినా తర్వాత పవన్ అయినా జనాలకు రాంగ్ మెసేజీలే పంపారు. చిరంజీవి కారణంగా దెబ్బతిన్న వారిలో అత్యధికులు పవన్ నమ్మకే జనసేనలో చేరలేదు. వరుసగా ఇద్దరు హీరోలు కాపుల కోసమే పార్టీ పెట్టారని ప్రచారం జరిగిన తర్వాత కూడా ఫెయిలయ్యారంటే అర్ధమేంటి ? ఇపుడు అంతస్ధాయున్న కాపు నేతలూ లేరు. ఒకవేళ కాపుల్లో ఎవరైనా ధైర్యం చేసినా నమ్మే జనాలూ లేరు. అందుకే ఇప్పటి పరిస్ధితికి చిరంజీవి, పవనే కారణమని చెబుతున్నది. హోలుమొత్తం మీద గమనించాల్సిందేమంటే కుల ప్రాతిపదికగా సక్సెస్ అయిన పార్టీ రాష్ట్రంలో లేదని.