గతంలో చాలా మంది నేతలు రాష్ట్రాన్ని సింగపూర్‌లా తయారు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పిన నేతలు ఎంతమంది ఆ పనిచేశారో తెలియదుగాని, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చెప్పిన విధంగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినట్టుగా చేసుకుంటూ పోతున్నది. అభివృద్ది పనులతో హైదరాబాద్ నగరం స్మార్ట్ గా మారతున్నదన్నది వాస్తవం. ఈ క్రమంలో నగరంలో వేగంగా అభివృద్ది పనులు సాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక ఫ్లైఓవర్లను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్నది. పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వే తరువాత నగరంలో నిర్మించిన రెండో పెద్ద ఫ్లైఓవర్‌ను ఇటీవలే మంత్రి కేటీఆర్, కిషన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు.
కొత్త సంవత్సరం రోజున ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్‌ను అత్యాథునిక టెక్నాలజీతో నిర్మించారు. ఆరు లైన్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. రాత్రి సమయంతో తీసిన విజువల్స్‌ను కేటీఆర్ తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆ విజువల్స్‌ను చూసి దుబాయ్, సింగపూర్ మాదిరిగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. నైట్ విజువల్స్ చూస్తుంటే మనం విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ. 350 కోట్ల రూపాయలతో నిర్మించారు.
టోలీ చౌకి లోని షేక్‌పేట్, రాయదుర్గం, షేక్‌పేట్ వరకు సుమారు 3 కిమీ మేర నిర్మించిన ఈ ఫ్లైఓవర్ వలన ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గిపోతాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో అభివృద్ధి జరుగుతోంది. పోలీస్ ఎక్కడా తగ్గకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ... తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని... టిఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాదులో పెట్టుబడులు పెట్టే దిశగా... కంపెనీలతో డీలింగ్ కుదుర్చుకుంటున్నారు. తద్వారా హైదరాబాద్ మహానగర రాబడి పెరిగి అభివృద్ధి సాగుతోంది.