ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లో రాణించారు జగన్..ఇప్పుడిదే ఆత్మ గౌరవ నినాదాన్ని వినిపిస్తున్నారు వైసీపీ రెబల్ లీడర్, ఆర్య వైశ్య సంఘ నేత సుబ్బారావు గుప్తా. అవును! ఇవాళ ఆయన ఆర్య వైశ్యులందరినీ విజయవాడ కేంద్రంగా ఏకం చేసేందుకు సమా యత్తం అవుతున్నారు.మంత్రి వాసన్న (పూర్తి పేరు: బాలినేని శ్రీనివాస్ రెడ్డి) రౌడీలకు స్టేషన్ లో జరిగిన రాచమర్యాదలను తాను మరిచిపోలేకపోతున్నానని అంటున్నారు. ఆత్మ గౌరవం కాపాడుకునేందుకు, ఆత్మాభిమానం చాటుకునేందుకు ఆర్య వైశ్యులం తా ఏకం కావాల్సిన తరుణం రానే వచ్చిందని సుబ్బారావు గుప్తా ఇవాళ గర్జిస్తున్నారు.
గాయపడిన సింహం నుంచి వచ్చిన శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.. విన్నారుగా ఈ కేజీఎఫ్ డైలాగ్..ఇప్పుడిదే ఏపీ రాజకీయాలనూ శాసించనుంది.శ్వాస నుంచి శాసనం దాకా పెను సంచలనం కానుంది.బాలినేని బాల్కనీలో సర్దుబాటు జరిగినా ఆ రోజు దెబ్బలు తిన్న ఆర్య వైశ్య సంఘం నేత సుబ్బారావు గుప్తా ఇవాళ ఆర్య వైశ్య ఐక్యత సభను మంగళవారం నిర్వహిస్తున్నారు.విజయవాడ ఎంబీవీకే ఆడిటోరియంలో ఈ సభ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులపై జరుగుతున్న దాడులకు నిరసన గా తాను ఉద్యమిస్తానని,ఆ రోజు రౌడీ షీటర్ సుభానీ చేతిలో ఘోరంగా దెబ్బలు తిని, తరువాత రాజీ రాజకీయంలో అనూహ్యంగా వెనుకంజ వేసిన సుబ్బారావు గు ప్తా ఇప్పుడు తనదైన పంజా ఒకటి విసిరారు.ఇప్పుడు వీస్తున్న చలిగాలుల నడుమ రాజకీయ వేడి ఒకటి పుట్టించారు.
దీంతో ఏం చేయాలో అంతుపట్టక మంత్రి వాసన్న మరియు జగన్ వర్గం తల పట్టుకుంటోంది.ఆ రోజు జగనన్న పుట్టిన రోజు న కేకు తినిపించి కేసు క్లోజ్ చేయించాలని చూ సినా కూడా సుబ్బారావు గుప్తా నాటి పరాభవం నుంచి కోలుకో లేదు.మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తానని బాలినేని చెప్పినప్పటికీ ఆర్య వైశ్య సంఘం శాంతించడం లేదు.దీంతో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులు, కళింగ వైశ్యులు ఏకమయ్యేందుకు ఇదే తరుణం అని అంటున్నారు సుబ్బారావు గుప్తా.త్వరలో ప్రకాశం జిల్లా, కనిగిరి కేంద్రంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని నిర్వహించేందు కు సమాయత్తం అవుతామని అంటున్నారు సుబ్బారావు గు ప్తా.తనను కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడాన్ని అతను జీర్ణించు కోలేకపోతున్నా రు. ఆ రోజు తన ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటికీ చట్టపరమైన చర్యలేవీ లేవని మండిపడుతున్నారాయన.