బాబుకి రాధా కావాలా..? పవన్ కావాలా..?

Deekshitha Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలన్నిటికీ కాపు ఓట్లు కావాల్సిందే. అదే సమయంలో కాపు నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వంగవీటి రాధా టెక్నికల్ గా టీడీపీలో ఉన్నా.. వైసీపీ నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. వైసీపీ నాయకులు ఆయనతో టచ్ లోనే ఉన్నారు. ఆయన అడక్కుండానే ప్రభుత్వం గన్ మెన్ల భద్రత కల్పించిందంటే.. రాధాపై ఉన్న సాఫ్ట్ కార్నర్ అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో టీడీపీ కూడా ఆయన్ను వదులుకోవాలనుకోలేదు. చాలా కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్టు ఉన్నా కూడా చంద్రబాబు, రాధాని దూరం చేసుకోవాలనుకోవట్లేదు. ఇంటికెళ్లి మరీ పలకరించి వచ్చారంటే రాధా వర్గంపై బాబుకి ఏ రేంజ్ లో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

పవన్ సంగతేంటి..?
ఏపీలో ప్రస్తుతం కాపు వర్గానికి ప్రతినిధులుగా భావిస్తున్న యువ నాకయత్వంలో రాధా, పవన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వైసీపీలో ఉన్న మంత్రులు, నేతలు.. మొత్తంగా తమ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా ఉండాలని అనుకోవడంలేదు. ఈ దశలో రాధా, లేక పవన్.. కాపుల తరపున బలంగా తమ వాణి వినిపించగలరు అని నమ్ముతున్నారు. చంద్రబాబు గతంలో పవన్ కల్యాణ్ ని దగ్గరకు తీశారు. ఆమధ్య పవన్ బీజేపీ, టీడీపీ రెండిటికీ గుడ్ బై చెప్పారు కానీ, తర్వాత మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు, ఇక టీడీపీతో కూడా స్నేహం చిగురిస్తుందనే అంచనాలున్నాయి.

రాధా ఇప్పటికీ టీడీపీ నేతగానే ఉన్నారు. పవన్ కల్యాణ్ త్వరలో టీడీపీతో స్నేహం మొదలు పెడతారనే అంచనాలున్నాయి. ఈ దశలో పవన్, రాధా.. ఇద్దరితో చంద్రబాబు కాపు వర్గం ఓట్లని ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నారు. అయితే పవన్, రాధా చెబితే.. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గంలోని ఓట్లన్నీ గుంపగుత్తగా టీడీపీకి పడిపోతాయా అంటే అనుమానమే. అదే నిజమైతే.. కనీసం జనసేన కాపు డామినేషన్ ఉన్న ప్రాంతాల్లో అయినా సత్తా చూపించి ఉండేది. కానీ చంద్రబాబు వ్యూహం వేరేగా ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరు చేజారినా కాస్తో కూస్తో కాపు ఓట్లలో చీలిక వచ్చే అవకాశముంది. అలా కాకుండా ఇద్దరూ టీడీపీకి సపోర్ట్ ఇస్తే కచ్చితంగా ఆమేరకు లాభం ఉంటుందని అనుకుంటున్నారు బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: