షర్మిల సైలెంట్ వర్క్..ఎవరిని ముంచుతారో?

M N Amaleswara rao
తెలంగాణలో రాజకీయాలు కేవలం మూడు పార్టీల మధ్యే తిరుగుతున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే రాజకీయం జరుగుతుంది. ఈ మూడు పార్టీలే అధికారం దక్కించుకునే రేసులో ఉన్నాయి. మళ్ళీ గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ చూస్తుంది...అటు కాంగ్రెస్ కూడా రెండుసార్లు ఎలాగో అధికారానికి దూరమయ్యం...ఈ సారి ఎలాగైనా సత్తా చాటి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇక అనూహ్యంగా పుంజుకుని రేసులోకి వచ్చిన బీజేపీ..తెలంగాణలో తొలిసారి కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తుంది.

అయితే ఈ మూడు పార్టీలని దాటి ఇంకో పార్టీ సత్తా చాటడం అనేది జరిగే పని కాదు. అధికారం అనేది ఈ మూడు పార్టీల్లో ఏదొక పార్టీకి దొరికే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తానని తిరుగుతున్న షర్మిల పార్టీ పరిస్తితి ఏంటి? అంటే ఆ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదని ఈ పాటికే అర్ధమైపోయింది. ఆ పార్టీకి రెండు, మూడు సీట్లు వచ్చిన గొప్ప విషయమే అని చెప్పొచ్చు.

కానీ షర్మిల పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగానే కష్టపడుతున్నారు. వాస్తవానికి ఆమె పార్టీ పెట్టిన మొదట్లో...బాగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇతర పార్టీల్లో ఉన్న నేతలు పెద్ద సంఖ్యలో షర్మిల పార్టీలో చేరతారని కథనాలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ పార్టీలోకి వలసలు జరగలేదు. ఆ పార్టీ బలపడలేదు. అలాగే మీడియాలో కూడా షర్మిల పార్టీ గురించి పెద్ద రచ్చ రావడం లేదు. కాకపోతే క్షేత్ర స్థాయిలో మాత్రం షర్మిల పార్టీని బలోపేతం దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.

ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ..కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న ఆమె..తన పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఎన్నికలు కాకపోయినా, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో వైఎస్సార్ అభిమానులు, పాత కాంగ్రెస్ శ్రేణులని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో షర్మిల పార్టీ ప్రభావం ఎంత వరకు ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: