జగన్ ఫెయిల్యూర్ పక్కానా...స్కెచ్ మరియు ప్రూఫ్ ఇదే... ?
కానీ రామారావు తీసుకున్న నిర్ణయంతో ఆర్కే అండ్ కో తోక ముడుచుకోక తప్పలేదు. రామారావు ఆమెను వివాహం చేసుకుని అందరీకే షాక్ ఇచ్చాడు. ఇక దీనిని అడ్డం పెట్టుకుని రామారావుకు తన కుటుంబ సభ్యులను దూరం చేశాడు. ఆఖరికి లక్ష్మి పార్వతికి మాత్రమే తనకు మిగిలింది. అలా ఆనాడు రామారావును సర్వనాశనం చేసి పార్టీని లాక్కోవడంలో పైన రామోజీ రావు, ఇక్కడ ఆర్కే ల కుతంత్రాలే కారణం. అయితే ఈ నాటికీ పార్టీని తెరవెనుక ఉంటోప్ కాపాడుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు అదే విధంగా జగన్ ను దెబ్బ తీయాలని ప్రణాళికలు రచిస్తున్నారు ఆర్కే. వైఎస్ షర్మిల మరియు వైఎస్ సునీత రెడ్డి ఇద్దరి ఆవేశాలను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటీకే పలు ప్రయత్నాలు జరిగాయి.
మాములుగా షర్మిలకు ఏపీలో రాజకీయంగా ఉన్నత పదవిలో ఉండాలన్నది ఆశ. కానీ వివిధ కారణాల వలన అందుకు జగన్ అంగీకరించలేదు. అందుకే షర్మిల జగన్ తో టచ్ లో లేదు. అయితే ఆర్కే అండ్ కో ఏపీలోనే షర్మిల పార్టీ పెడుతుంది అనుకుంటే ఆమె తెలంగాణలో పెట్టడంతో ప్లాన్ బెడిసికొట్టింది. అయినా అవకాశం వచ్చినప్పుడల్లా షర్మిలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఇక వైఎస్ విజయసాయిరెడ్డి కూతురు డాక్టర్ సునీత విషయంలోనూ ఇదే విధంగా పావులు కదుపుతోంది ఆర్కే గ్రూప్. తన నాన్నను హత్య చేయించింది జగన్ అని నమ్మేలా చేయడంలో ఆర్కే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరినీ వాడుకుని వైఎస్ ఇంటిలో చెల్లెల్లకు అన్యాయం చేసిన జగన్ అని ముద్ర వేసి అటు కుటుంబంలో చీలికలు ఇటు రాజకీయంగా అధికారాన్ని పోగొట్టాలని ఆర్కే అండ్ గ్రూప్ కంకణం కట్టుకున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే జగన్ వీటిని ఏ విధంగా ఎదుర్కొంటాడన్నది చూడాలి.