
2021లో ఏపీ రాజకీయంలో వచ్చిన కొత్త మార్పు చూశారా..!
అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో తన కుటుంబానికి అవమానం జరిగిందంటూ.. ఆయన కన్నీరు పెట్టుకోవడం మరింతగా రాజకీయాలను సృష్టించింది. మరోవైపు ప్రజాగ్రహం పేరిట భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ సభను ఏర్పాటు చేసి.. రాజకీయంగా పుంజుకునే ప్రయత్నం చేయడం వంటివి ఈ ఏడాదిలో చోటు చేసుకున్న మరికొన్ని కీలక ఘట్టాలు. వీటన్నింటికీ తోడు.. చంద్రబాబు చేసిన శపథం కూడా.. ఆసక్తిగా మారింది.
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే.. అసెంబ్లీలోకి అడుగు పెడతానని ఆయన అన్నారు. ఇక, మరోపార్టీ జనసేన ఊసు ఈ ఏడాది తక్కువనే చెప్పాలి. 2018, 19, 20లతో పోల్చుకుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2021లో కేవలం సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. మధ్యలో నాలుగు నుంచి ఐదు సార్లు మాత్రమే.. పవన్ ఏపీలో పర్యటించారు. అది కూడా అక్టోబరు 2న శ్రమదానం పేరుతో హడావుడి చేశారు. ఆ తర్వాత.. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం.. అక్కడ సభ నిర్వహించ డంతోపాటు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన.. ఒక పూట దీక్ష చేశారు. ఇది పెద్దగా క్లిక్ కాలేదనే భావన పార్టీ వర్గాల్లోనే వినిపించడం గమనార్హం.
మరోవైపు.. కమ్యూనిస్టుల పరిస్థితి మరింత ఇరకాటంలో పడిపోయింది. ఇప్పటి వరకు ఒంటరిగా పోరాటం చేయని.. వీరు గతంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో బయటకు వచ్చి.. టీడీపీతో అనధికార పొత్తును కొనసాగిస్తున్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేస్తాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టులకు పొత్తులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు ఏం చేయాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నాయి.
ఇదిలావుంటే.. అనేక మంది నాయకులు.. పార్టీలకు దూరంగా ఉండడం.. మరికొందరు.. ఏ పార్టీ బలపడి తే.. ఆ పార్టీలో చేరాలని భావించడం.. అయితే.. పార్టీలు బలపడకపోవడం వంటివి వారికి ఇబ్బందిగా పరిణమించింది. ఇక, బీజేపీ ఇప్పటి వరకు అంతో ఇంతో బలం పుంజుకుంటోందని భావించిన సమయంలో విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు. చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాము అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ 50కే ఇస్తామని చెప్పడం ద్వారా పార్టీ ఇప్పటి వరకు సంపాయించుకున్న అంతో ఇంతో ఇమేజ్.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇలా.. అధికార పార్టీ మినహా.. అన్ని పార్టీలకూ ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి.