కొత్త సంవత్సరం అంటే ఎన్నో కొత్త పథకాలు, మరెన్నో కొత్త రూల్స్ పాటుగా ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇక విమాన ప్రయానాలు చేసే వారికి కూడా మరో అద్భుతమైన ఆఫర్ ను స్పైస్‌జెట్ ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్బంగా స్పైస్‌జెట్ విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఎక్కడికైనా ప్రయాణించాలని లేదా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఇంకా ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది.ప్రయాణీకులు ఇప్పటికీ రూ. 1122కి విమానంలో ప్రయాణించవచ్చు.
ఎయిర్‌లైన్ కంపెనీ స్పైస్‌జెట్ తన వావ్ వింటర్ సేల్‌ను గత నెల 27 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే.. కాగా ఆ ఆఫర్ ను ఈ నెల 5 వరకూ పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.డిసెంబర్ 27 నుండి డిసెంబర్ 31 వరకు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఆఫర్ కింద కేవలం రూ.1122కే దేశీయ విమానాల్లో ప్రయాణించే అవకాశం ప్రయాణికులు పొందుతున్నారు. కానీ ఇప్పుడు స్పైస్‌జెట్ ఈ ఆఫర్‌ను జనవరి 5, 2022 వరకు పెంచినట్లు ఆయా కంపెనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వావ్ వింటర్ సేల్ ఆఫర్ ప్రయాణ తేదీకి కనీసం 15 రోజుల ముందు చేసిన బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎయిర్ ఇండియా సంస్థ స్పైస్‌జెట్ వావ్ వింటర్ సేల్‌లోని ప్రయాణికులు జనవరి 15 నుండి ఏప్రిల్ 15 వరకు చార్జీల పై రాయితీని పొందవచ్చు. ఒకవేళ మీరు ప్రయాణం రద్దు చేసుకోవాలని అనుకుంటే మాత్రం రెండు రోజుల ముందు చేసుకుంటే ఎటువంటి రుసుము వర్థించబడదు..1122కే విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని స్పైస్‌జెట్ ప్రయాణికులకు కల్పించింది. అదే సమయంలో, తదుపరి ప్రయాణంలో రూ.500 ఉచిత ఫ్లైట్ వోచర్ కూడా అందుబాటులో ఉంది. అది కేవలం ఈ నెలచివరి వరకూ అందుబాటులో ఉంది. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..