డిఆర్డిఓ మరో అద్భుతం.. రుద్రం సక్సెస్?

praveen
చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది అన్న విషయం తెలిసిందే. భారత్ నుండి చైనాను పూర్తిగా భారత్ నుంచి నిషేధించడమె లక్ష్యంగా మేకిన్ ఇండియా నినాదాన్ని భారత ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చింది. ఇక మేకిన్ ఇండియా నినాదం లో భాగంగా అన్ని రకాల వస్తువులతో పాటు ఆయుధాలను కూడా తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగింది భారత ప్రభుత్వం. ఈ ప్రణాళికలో భాగంగానే భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో కి భారీగా నిధులు కేటాయించింది.


 ఈ క్రమంలోనే రక్షణ రంగ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కూడా వినూత్నమైన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను తయారు చేస్తూ శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటివరకు డిఆర్డిఓ నిర్వహించిన అన్ని ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. లైట్ వెయిట్ యుద్ధ విమానాలతో ఎన్నో అద్భుతమైన క్షిపణులను కూడా అటు డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఇప్పుడూ ప్రపంచంలోనే మొదటి సారి యాంటీ రేడియేషన్ క్షిపణి తయారు చేసేందుకు డిఆర్డిఓ సిద్ధమైంది అని తెలుస్తోంది.



అయితే దాదాపు డిసెంబర్ నెలలోనే drdo ప్రయోగాలు 8 వరకు సక్సెస్ సాధించాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మేకిన్ ఇండియా లో భాగంగా భారత్ మొట్ట మొదటి యాంటీ రేడియేషన్ మిస్సైల్ తయారుచేసింది. దీనికి రుద్రం అనే పేరును ఖరారు చేశారు. శబ్దానికి మించిన  రెండింతల వేగంతో ఇక ఈ మిస్సైల్ దూసుకుపోతోందట. అంతేకాకుండా ఎంతో దూరం నుంచి శత్రుదేశాల రాడార్ వ్యవస్థలను కూడా నాశనం చేయగల అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉంటుందట. అయితే ప్రపంచంలో ఈ తరహా మొట్టమొదటి క్షిపణిని భారత్ కనుగొంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలో ఇతర దేశాల నుంచి భారత్లో సంస్థలను స్థాపించి ఆయుధాలను తయారు చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలతో కలిసి ఈ క్షిపణిని మరింత అభివృద్ధి చేసేందుకు drdo సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: