చైనాను బహిష్కరించండి.. షాకిచ్చిన చిన్ని దేశం?
తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు చైనా. పొరుగున ఉన్న చిన్న దేశాలతో ఇక తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించడం లేదు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేలా చేస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే లిథువేనియా దేశం చైనా కు ఊహించని షాక్ ఇచ్చింది. తాము తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాము అంటూ తెలిపింది. అంతేకాకుండా విస్తరణ వాద దోరణితో ముందుకు సాగుతున్న చైనాను బహిష్కరిస్తున్నామని లిథువేనియా స్పష్టం చేసింది. అంతేకాదు తైవాన్ ను తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు లిథువేనియా ఆహ్వానించడం గమనార్హం.
అంతేకాకుండా ఇక తమ దేశంలో చైనా ఫోన్లు అన్నింటినీ కూడా బహిష్కరించాలి అంటూ ప్రజలకు పిలుపు నిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం పెద్ద పెద్ద దేశాలు సైతం చైనా కు ఎదురు వెళ్ళటానికి భయపడుతూ ఉంటే చిన్న దేశమైన లిథువేనియా మాత్రం చైనాను ఎదిరించి నిలబడింది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే లిథువేనియా ఇలా చైనా బహిష్కరించి తైవాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని.. తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ తెలపడంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అన్నది చూడాలి మరి.