తెలంగాణ అంటేనే జానపదాలకు పుట్టినిల్లు. ఎందరో జానపద కళాకారులు, ఎందరో కళాతపస్విలు తమ పాటలు తమ కవితలతో సమాజానికి ఏదో ఒక రకంగా వారి యొక్క గొంతులు వినిపిస్తారు. అలాంటి కళాకారుల్లో ఒకరు గోరేటి వెంకన్న. వెంకన్న గళం విప్పితే చిన్న పిల్ల నుండి ముసలి అవ్వ వరకు గంతులేయాల్సిందే. పల్లె కన్నీరు పెడుతుందో పాట నుండి గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది పాట వరకు ప్రజల మనసును ఆకట్టుకున్నవే. ఆయన పాటలే కాకుండా అనేక బుక్కులు కూడా రాశారు. మరి అంతటి మహానుభావుడి జీవిత చరిత్ర ఏంటి.. అతను పాటలు రాయడానికి కారణం ఏంటో తెలుసుకుందామా..!
తెలంగాణ ప్రజా జీవితాన్ని తన పాటల ద్వారా బయటకు తెలియజేసిన వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న పల్లె పాటలతో తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఆదరణ పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన పాటలు కీలకంగా ఉన్నాయి. తన పాటల ద్వారా విశ్వవ్యాప్త కీర్తిని సంపాదించుకున్నాడు గోరేటి వెంకన్న నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామానికి చెందిన తెలంగాణ ప్రజలకు జీవన విధానాన్ని తన పాటల ద్వారా వివరించి పాడిన ఆణిముత్యం. రచయితగా గాయకుడిగా గోరేటి వెంకన్న ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2006లో కళారత్న పురస్కారం, తర్వాత కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాన్ని కెసిఆర్ ఇచ్చారు. దీంతోపాటుగా 2021 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గోరేటి వెంకన్న వరించింది. ఆయన రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి ఈ ఒక్క అవార్డు దక్కింది.
ఆయనకు అవార్డుతో పాటు ప్రశంసాపత్రం కింద లక్ష రూపాయలు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ 20 ప్రాచుర్యం పొందిన భాషలలో ఈ యొక్క అవార్డులను ప్రకటించింది. ఈ తెలుగు భాష నుంచి మొత్తం 13 మంది రచయితలు పోటీపడగా ఈ అవార్డు గోరేటి వెంకన్న కు దక్కింది. ఈ సందర్భంగా గోరేటి వెంకన్న మాట్లాడుతూ అది వాగ్గేయ సంప్రదాయానికి ఇచ్చిన అవార్డుగా అభివర్ణించారు. ఇందులో కూడా తెలంగాణకు ఇవ్వడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని కవి గాయకుడు గోరేటి వెంకన్న తెలియజేశారు.