
చైనా కొత్త కుట్ర.. తైవాన్ కు షాకిచ్చిన పొరుగు దేశం?
అయితే ఇప్పుడు నక్క జిత్తుల మారి చైనా కన్ను పొరుగుదేశమైన తైవాన్ పై పడింది అన్న విషయం తెలిసిందే. హాంకాంగ్ టిబెట్లను చైనాలో కలుపుకున్నట్లుగానే తైవాన్ ను కూడా స్వాధీనం చేసుకోవాలి అని ప్రయత్నిస్తోంది. దీని కోసం ఎన్నో రోజుల నుంచి చేయని ప్రయత్నం అంటూ లేదు అని చెప్పాలి. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించి యుద్ధానికి సిద్ధం అంటూ సంకేతాలు ఇవ్వడం.. తైవాన్ చైనాలో భాగమని ఇతర దేశాలతో ఒప్పందాలు పెట్టుకోవడానికి వీలు లేదు అంటూ స్టేట్మెంట్ లు ఇవ్వటం కూడా సంచలనంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తైవాన్ ను ఒక స్వతంత్ర దేశంగానే గుర్తిస్తూ ఉండటం గమనార్హం.
తైవాన్ ప్రభుత్వం కూడా తమది ఏ దేశంలో అంతర్భాగం కాదని.. తమది స్వతంత్ర దేశం అంటు కౌంటర్లు ఇస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం దౌత్య పరంగా వ్యూహాలకు చైనా పదును పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తైవాన్ పొరుగుదేశమైన నికరాగువా కు భారీగా అప్పులు ఇచ్చింది చైనా ఈ క్రమంలోనే తైవాన్ చైనాలో అంతర్భాగమని తాము తైవాన్ ను స్వతంత్ర దేశంగా చూడటం లేదు అంటూ ప్రభుత్వం తెలిపింది. అంతే కాకుండా తమ దేశంలో వున్నటువంటి రాయబారులు అందరూ వెనక్కి వెళ్లిపోవాలని రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని దీనికోసం కేవలం పది రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాము అంటూ చెప్పింది నికరాగువా. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.