జనవరి నెలాఖరు కు ఏపి నూతన పిసిసి అధ్యక్షుడు నియామకం కానుంది. “ఫ్రంట్ రన్నర్”గా డా. చింతామోహన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.
ఏపి కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ... సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో అందరినీ కలుపుకుని పోయే నాయ కు డు కోసం అన్వేష ణ చే స్తున్నారని సమా చారం అందుతోం ది. సంక్రాంతి లోపే ఏ పి సీని యర్ నాయకులను స్వయంగా మరోసారి సంప్రదించనున్న ఉమన్ చాండీ... ముందుగా హైదరాబాద్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య కుటుంబ సభ్యులను కలవనున్నారు విశ్వశానియ సమాచారం అందుతోంది
హైదరాబాదు లో అందుబాటులో ఉన్న ఏపి నేతలతో సమావేశం కానున్న ఉమన్ చాండీ... పిసిసి అధ్యక్షుడు నియామకం, పార్టీ ని ఏపిలో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు ఉమన్ చాండీ. ఆ తర్వాత, విజయవాడ వెళ్లి మరోసారి ముఖ్యమైన రాష్ట్ర నేతలను కలిసి అంతిమంగా నివేదిక ను సిధ్దం చేయనున్న ఏఐసిసి ఇంచార్జ్ ల బృందం... సాధ్యమైనంత త్వరగా అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఏఐసిసి స్పష్టమైన ఆదేశాలు చేయనున్నట్లు సమాచారం అందుతోంది..
జనవరి నెలాఖరు కల్లా ఏపిసిసి నూతన అధ్యక్షుడు నియామకం పూర్తి కావాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది.. పరిశీలనలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి.డబ్ల్యు.సి) సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్ పేరు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్షకుమార్, ఏఐసిసి సెక్రటరీ మస్తాన్ వలీ పేర్లను కూడా పరిశీలిస్తుంది ఏఐసిసి ఇంచార్జ్ ల బృందం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం అందుతోంది.