
రోజాకు ఆ వైసీపీ బడా నేత సపోర్ట్... ఇంత కథ నడుస్తోందా ?
అయితే గత ఎన్నికల దగ్గర నుంచి నగరి వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. కొందరు నేతలు రోజాకు వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. అలాగే వారు పార్టీ కార్యక్రమాలని సెపరేట్‌గా చేస్తున్నారు. ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఒక ఎంపీపీ విషయంలో రోజాకు, వ్యతిరేకత వర్గం మధ్య పెద్ద రచ్చ నడిచింది. మధ్యలో మంత్రి పెద్దిరెడ్డి కల్పించుకోవడంతో కాస్త సమస్య సద్దుమణిగింది.
సరే అంతా సర్దుకుంటుందనే లోపే...ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల గురించి రగడ నడిచింది. అలాగే రోజా వ్యతిరేక వర్గం సెపరేట్‌గా కార్యక్రమం చేసి రోజాపై విమర్శలు చేశారు. ఆమెకు సొంతంగా గెలిచే బలం లేదని, తామే రోజాని గెలిపించామని మాట్లాడారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలంటే తమ మద్ధతు కావాలన్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా వ్యతిరేక వర్గం చేస్తున్న మాటలని రోజా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వారు ఏం చేసుకుంటారో చేసుకొని అన్నట్లు చూస్తున్నారు.
ఇలా రోజా ధీమాగా ఉండటానికి కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. జగన్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న ఓ నాయకుడు మద్ధతు రోజాకు ఉందని తెలుస్తోంది. ఆ ధీమాతోనే రోజా...వ్యతిరేక వర్గాన్ని కేర్ చేయడం లేదని అర్ధమవుతుంది. అయితే ఏ నాయకుడు సపోర్ట్ ఉన్నా సరే...ఒకసారి పార్టీలో ఆధిపత్య పోరు పెరిగితే...ఎన్నికల్లో గెలవడం కష్టమైపోతుంది. అసలే రెండుసార్లు తక్కువ మెజారిటీలతోనే రోజా గెలిచారు...మరి ఈ సారి పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి.