నిజమేనా ?...రాష్ట్ర పతి పై ఓమిక్రాన్ ఎఫెక్ట్ ?


కోవిడ్-19 నూతన వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం ప్రముఖుల పై పడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్-19 నిబంధనలను  ముమ్మరం చేశాయి. కర్ణాటక రాష్ట్రంలో మొదలైన నైట్ కర్ఫ్యూ ఇతరు రాష్ట్రాలు కూడా అమలు చేయానున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ, హర్యానా,  మహారాష్ట్ర ప్రభుత్వాలుకూడా రాత్రి వేళ కర్ఫ్యుూ  ప్రకటంచేశాయి. మధ్య ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కూడా  ఆంక్షలు  విధించనున్నట్లు సంకేతాలిచ్చాయి.
భారత రాష్ట్రపతి ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో శీతాకాలం విడిది చేయడం రివాజు. ఇదే సంప్రదాయాన్ని భారత రాష్ట్రపతులందరూ దాదాపుగా అనుసరించారు. గతంలో నెల రోజుల పాటు ఉండిన విడిది కాలం క్రమంగా తగ్గుతూ వచ్చింది.  పరిపాలనా పరమైన ఒత్తిడుల వల్ల శీతాకాల విడిది కాలం తగ్గుతోందని రాష్ట్రపతి భవన్ వర్గాలు ఒక సందర్భంలో పేర్కోన్నాయి.
 తాజాగా  ప్రస్తుత రాష్ట్రపతి పర్యటనపై కోవిడ్ ప్రభావం పడినట్లు సమాచారం. ఆయన దక్షిణాది విడిది పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిడ్ హైదరాబాద్ వస్తారని, జనవరి నెల మూడవ తేదీ వరకు ఇక్కడ బస చేస్తారని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ గతంలో సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆతిథ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను భారత దేశ తొలి పౌరుడికి తెలిసేలా చర్యలు తీసుకోవాలని  ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధికారులసు సూచనలు చేశారు. అంతటితో ఆగకుండా  పనులు ఎంత వరకూ వచ్చాయనే విషయమైే మరలా రివ్యూ చేశారు కూడా. రాష్ట్రపతి విడిది చేయనున్న బొల్లారం అతిథి గృహం ప్రాంతాలను అధికారులు పలుమార్లు సందర్శించారు. చిన్న చితకా రిపేర్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో ముందస్తు తనిఖీలు చేశారు. అతిధి గృహం చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు తమ గస్తీని ముమ్మరం చేశారు.  ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసులు  ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాగా రాష్ట్రపతి పర్యటన రద్దయినట్లు  తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది.  కోవిడ్-19 నూతన వేరియంట్ ఓమిక్రాన్ ప్రభావం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: