అందరికీ షాక్ ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి ఎవరు ?
ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఊహించని మద్దతు లభించింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం కలిగిన ఆ మాజీ కేంద్ర మంత్రి బిజేపి చర్యలను సమర్థించారు. ఇంతకీ ఎవరా మాజీ కేంద్ర మంత్రి ?
దక్షిణాదిన అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ర్ంలో భారతీయ జనతా పార్టీ ఇటీవల ఓ బిల్లు తీసుకు వచ్చింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మతమార్పిడులనుద్దేశించిన ఆ బిల్లును దేశ వ్యాప్తంగా పలు రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బిజేపి తన హిందుత్వ అజెండాను అమలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. మరి కొన్నిపార్టీలు మరింత ముందుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే మత మార్పిడులపై చట్టం చేస్తుందని, దీనికి పూర్వ రంగంగానే కర్ణాటక శాసన సభ ముందుకు బిల్లు వచ్చిందని ఆరోపిస్తున్నారు. దాదాపు నలభై ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత , గతంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన వైరిచర్ల కిశోర్ చంద్ర దేవ్ కర్ణాటక ప్రభుత్వం తీసుకు వచ్చిన మతమార్పిడుల బిల్లుకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో భారతీయ జనతా పార్టీతో సహా దేశం లోన్ని రాజకీయ పక్షాలు నివ్వెర పోయాయి.
వాస్తవానికి కిశోర్ చంద్ర దేవ్ ది ఆంధ్ర ప్రదేశ్. ఉత్తరాంధ్ర జిల్లాలలో మంచి పట్టున్న గిరిజన నేత, పైగా విద్యాధికుడు. 1970 నుంచి ఆయన వివిధ చట్టసభల్లో సభ్యుడు. గిరిజన సమస్యలపై పార్లమెంట్ లో జరిగే చర్చల్లో ఆయన గొంత అందరికీ పరిచయమే. ప్రస్తుతం ఆయన పార్లమెంట్ సభ్యుడు కాకపోవడంతో సంసద్ లో ఆయన స్వరం వినపడుట లేదు. మృదు స్వభావిగా పేరున్న కిశోర్ చంద్ర దేవ్ వార్తల్లోకి ఎక్కడం దాదాపు ఉండదు. స్వపక్షం పైన కానీ, విపక్షం పైన కానీ ఆయన ఘాటు వ్యాఖ్యులు చేసింది చాలా తక్కువ. పై పెచ్చు నాటి తరానికి, నేటి తరానికి ఉన్న గ్యాప్ కారణంగా ఆయన రాజకీయ కార్యకలాపాలు సహజంగానే మీడియా దృష్టిని ఆకర్షించవు.
కిశోర్ చంద్ర దేవ్ ఒక్క సారిగా జాతీయ మీడియాను ఆకర్షించారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకువస్తున్న మతమార్పిడుల బిల్లు ఏ విధంగానూ గిరిజనుల హక్కులను కాలరాయదని పేర్కోనడం ద్వారా ఆయన దేశం దృష్టిని ఆకర్షించారు. అయితే బిల్లులో పేర్కోంటున్న కొన్ని అంశాలు మాత్రం ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ఆది వాసీలనే తెగ వారు ఆదివాసీలుగానే పుడతారని, ఆది వాసీలుగానే జీవిస్తారని, వారి మరణం, ఆ తరువాత జరి క్రియలన్నీ కూడా ఆదివాసీ సంప్రదాయాలను అనుసరించే ఉంటాయని కిశోర్ చంద్రదేవ్ పేర్కోన్నారు. అంతేకాదు 1959లో ,సుప్రీం కోర్టు తీర్పును ఉదహరించారాయన. వివిగిరి వర్సెస్ డిప్పోల సూరి దొర తదుతరుల మధ్య జరిగిన వ్యాజ్యంలో కోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ ఓ సారి చూడాలని చెప్పారు. ట్రైబల్ గా పుట్టిన వ్యక్తి ట్రైబల్ గానే మరణిస్తాడని ఆ తీర్పు స్పష్టంగాపేర్కోందని కిశోర్ చంద్ర దేవ్ పేర్కోన్నారు.
అన్నట్లు కిశోర్ చంద్ర దేవ్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ ను వీడారు. పసుపు కండువా కప్పుకున్నారు. టిడిపి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఈయన చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ విగా స్వీకరించాలా ? అది ఆయన స్వంత అభిప్రాయమా ?