మట్టిని తవ్వి మట్టి పాలు చేశార్రా?
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ కథ మొత్తం మారిపోయింది. ఆ నగరం ముఖ చిత్రం కూడా మారిపోయింది. మారిపోయింది అంటే అదేదో గొప్ప అనూహ్య ఫలితం అని మాత్రం అనుకోకండి. మారిపోయింది అంటే ఏమీ కాని విధంగా ఎవ్వరికీ పట్టని విధంగా ఉంది అని అర్థం. పాలనా సౌలభ్యం కోసం తాము 3 రాజధానులు తీసుకువస్తున్నామని, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది అస్సలు తమకు మాత్రమే సాధ్యం అయ్యే పని అని చెబుతున్న వైసీపీ వనరుల దోపిడీలో మాత్రం ముందుంటుంది అన్నది విపక్షాల ఆరోపణ. ఇందులో భాగంగా విశాఖ కేంద్రంగా అనేక తవ్వకాలు సాగుతున్నాయి. అనేక మట్టి తవ్వకాలు అధికారం పేరిట ఊరు దాటి పోతున్నాయి. అయినా కూడా వైసీపీ సర్కారు మాత్రం దేనినీ నిలువరించలేకపోతోంది. ముఖ్యంగా రుషికొండ చుట్టూ నిబంధనలు దాటి మట్టి తవ్వకాలు సాగిపోతున్నా అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారన్న విమర్శలు అయితే ఉన్నాయి.
పాలకపక్షానికి బెదిరింపు రాజకీయాలు తప్ప మరేవీ పట్టడం లేదు. అలాంటప్పుడు విశాఖ రాజధానిగా రేపు మారాక ఇక్కడున్న వారికి భద్రత ఎక్కడి నుంచి వస్తుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే సాయిరెడ్డి తో సహా చాలా మంది బెదిరింపు రాజకీయాల్లో భాగంగానే వనరుల తరలింపు కూడా యథేచ్ఛగా సాగిపోతోంది అన్న వాదన కూడా విపక్షం వినిపించినా పట్టించుకునే సమయం మాత్రం సీఎంకు లేదు అన్నది ఓ విమర్శ.