పాక్ కుట్ర.. భారత సైన్యం ఎంట్రీతో పరుగో పరుగు?

praveen
సాధారణంగా ప్రతి దేశం ఎన్నో దేశాలతో దౌత్య పరమైన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఎన్నో దేశాలతో మిత్ర సంబంధాన్ని కూడా కొనసాగిస్తూ ఉంటుంది. వాణిజ్యపరమైన ఒప్పందాలను కూడా ఇతర దేశాలలో కుదుర్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. అయితే ఎన్ని చేసినా అది రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మాత్రం వివిధ దేశాలతో కూడా ఏ దేశం పంచుకోదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కీలకమైన సైనిక స్థావరాల కు సంబంధించిన విషయాలను ఎప్పుడు సీక్రెట్ గా నే ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ప్రతి దేశం.


 ఇప్పుడు భారత్ కూడా ఇలా దౌత్య పరంగా ఎన్నో దేశాల తో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకున్నప్పటికీ.. భారత సైనిక స్థావరాలు ఎక్కడున్నాయ్ అనే విషయాలను మాత్రం ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు చైనా బానిస దేశమైన పాకిస్థాన్ మాత్రం లేకుండా తమ సైనిక స్థావరాలను అటు చైనాకు చూపించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే భారత్ ను దెబ్బకొట్టేందుకు ఎక్కడెక్కడ స్థానిక స్థావరాలు ఏర్పాటు చేయాలనే దానిపై చైనా పాకిస్తాన్కు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.



 అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ల మధ్య ఎంతో కీలకమైనటువంటి ప్రాంతమైన తీత్వాల్ సెక్టార్లో భారీ వాల్ నిర్మించాలని చైనా సూచించడంతో ఇక దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టింది పాకిస్తాన్. దీంతో భారత్ సైనికులు అక్కడికి చేరుకుని పాక్ సైన్యాన్ని హెచ్చరించారు.. ఈ ప్రాంతం ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంది. ఇక దీనికి సంబంధించి వివాదం పరిష్కారం కాకుండా ఇక్కడ వాల్ నిర్మించడం ఏంటి అంటూ ప్రశ్నించింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన ఊరుకోబోమని అంటూ హెచ్చరించింది. ఈ క్రమంలోనే భారత్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడ వాల్ నిర్మాణం చేపడుతున్న పాకిస్థాన్ సైనికులు అక్కడినుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో  దీని పరిణామము ఎక్కడి వరకు వెళుతుంది అని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: