రెండు దశాబ్దాల తర్వాత ఆ కోటలో సైకిల్‌కు ఛాన్స్...!

frame రెండు దశాబ్దాల తర్వాత ఆ కోటలో సైకిల్‌కు ఛాన్స్...!

VUYYURU SUBHASH
కర్నూలు జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పేయొచ్చు. ఈ జిల్లాలో టీడీపీ మంచి విజయాలు సాధించిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడో 1999 ఎన్నికల్లో కాస్త మంచి విజయాలు సాధించింది గానీ...ఆ తర్వాత నుంచి అంటే 2004, 2009, 2014, 2019 ఎన్ని కల్లో పెద్దగా విజయాలు అందుకోలేదు. అసలు 2019 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలిసిందే.

అయితే 2019 ఎన్నికల ఫలితాలని కాలరాస్తూ, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మంచి విజయాలు అందుకోవాల ని టీడీపీ నేతలు కష్టపడుతున్నారు. దాదాపు సగం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బాగానే పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో కర్నూలు పార్లమెంట్ స్థానం లో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సైతం దూకుడుగానే పనిచేస్తున్నారు. కొంతకాలం నుంచి ఆయన బాగా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉండగా కర్నూలు పార్లమెంట్ సీటు కోట్ల ఫ్యామిలీ కంచుకోట అనే సంగతి తెలిసిందే.

2014 నుంచి మాత్రం వైసీపీ అడ్డాగా మారిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీనే గెలిచింది. కానీ ఈ సారి మాత్రం వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని టీడీపీ సీనియర్ నేత కోట్ల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటినుంచే పార్లమెంట్ పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాల్లో ఇంచార్జ్‌లతో కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు సిటీ, మంత్రాలయం, ఆలూరు లాంటి నియోజకవర్గాల్లో టీడీపీకి కాస్త బలం పెరిగింది.

పైగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌పై ప్రజా వ్యతిరేకత కూడా పెరిగిందని పలు సర్వేలు కూడా వస్తున్నాయి. దీంతో కోట్లకు బాగా అడ్వాంటేజ్ వచ్చింది. నెక్స్ట్ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అనుకున్న మేర సత్తా చాటలేకపోయినా...ఎంపీ స్థానంలో మాత్రం కోట్లకు క్రాస్ ఓటింగ్ జరిగేలా ఉంది. ఇదేగానీ జరిగితే 1999 ఎన్నికల తర్వాత కర్నూలు కోటలో టీడీపీ జెండా ఎగురుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: