సంక్రాంతి సంబరాలకు 'ఒమిక్రాన్' అడ్డు పడేనా?

VAMSI
పండుగలు వస్తున్నాయి అంటే చాలు ఇక హిందువులకు ఎక్కడ లేని రెక్కలు ఎగిరి వస్తాయి. అందులోనూ పెద్ద పండుగ సంక్రాంతి అంటే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, పిండి వంటలు, రంగు ముగ్గులు, కొత్త బట్టలు, ఇంటి నిండా చుట్టాలు, ప్రయాణాలు, బంధువులతో కలిసి సరదాగా గడిపే నిముషాలు. ఇలా ప్రతి ఒకటి స్పెషలే. అయితే ఎపుడు లేనిది మన పండుగలకు గత రెండేళ్లుగా బ్రేక్ ఇస్తూ మన సంతోషాలకు సంకెళ్లు వేసి వచ్చింది కరోనా వైరస్. ఈ ఏడాదిలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది అనుకునే లోపు... ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ తో మళ్ళీ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి.

రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ఈ వైరస్ ఎక్కడ మళ్ళీ ఈ విషయాన్ని మొదటికి తీసుకెళ్తుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. నూతన సంవత్సరం మొదలైంది మొదలు సంక్రాంతి  వేడుకలు మొదలవుతాయి. కానీ ఈ  ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా పండుగలు జరుపుకోవడానికి ప్రజలు సంకోచిస్తున్నారు , ఎటునుండి ఈ మహమ్మారి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అంటూ భయపడుతున్నారు, మరో వైపు ప్రభుత్వం, ఆరోగ్య నిపుణులు కూడా  ఒమిక్రాన్ విషయంలో కరోనాకు మించిన జాగ్రత్త అవసరమని సూచిస్తున్న తరుణంలో ఈసారి సంక్రాంతి సంబరాలు సో సో గా గడిచిపోయేలా ఉన్నాయి.


ఒకవేళ అలా కాకుండా ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి, ఓమిక్రాన్ వెళ్ళిపోయి ఎప్పటిలాగే అందరితో కలిసి సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుందాం. ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం నే  ఫాలో అవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ప్రయాణాల రద్దీ కూడా పెద్దగా కనిపించదు, బంధువులు, చుట్టాలు ప్రయాణాలు అంటే ఆలోచించే పరిస్థితిలో ఉన్నాం...మరి కొత్త సంవత్సరం వచ్చాక అయినా ఈ పరిస్థితులు అన్నీ మారుతాయి ఏమో చూడాలి. మరి మునుపటి రోజుల్లో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: