జగన్@49 : అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న పాట?
ఈ క్రమంలోనే కొంతమంది జగన్ అభిమానులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇక వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు సంబంధించిన పుట్టిన రోజులు వచ్చాయి అంటే చాలా సోషల్ మీడియాలో ఎన్నో పాటలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. ఆయా రాజకీయ నాయకుల గొప్పతనాన్ని, పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తావిస్తూ ఎన్నో పాటలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా జనం మెచ్చిన నాయకుడుగా దూసుకుపోతున్న సీఎం జగన్ పుట్టినరోజు పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక ఈ పాటలోని ప్రతి పదం కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది అని చెప్పాలి. పాట జగన్ అభిమానులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. చరిత పుటలు కోరుకున్న కొత్త కథ నీవే.. విధి కూడా తలవంచే సంకల్పం నీదే.. ఆంధ్ర నాట ప్రగతి కే విధాతవైనావే.. జనం గుండె గుడినా జగన్ మోహన్ రెడడివి నీవే అంటూ సినీ నటుడు సాయికుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కదిలే నిప్పు కణమే.. కనులే కత్తి పదునే.. మాటై తాను బరిలో దిగితే అది పదము కాదు శరమే.. గెలుపై దూకు పిడుగే.. సాటేది రాని ఘనుడే.. ఎదురై బరిలో అతడే దిగితే రణం తనకు వశమే అంటూ లిరిక్స్ సాగిపోతూ ఉంటుంది. ఈ పాట వింటున్నంత సేపు ప్రతి లైన్ కూడా సీఎం జగన్ కు సరిగ్గా సరిపోతుంది అని అభిమానులు భావిస్తున్నారు.