ఒమిక్రాన్ : DCGI అనుమతిని కోరిన భారత్ బయోటెక్.. ఎందుకంటే?

Purushottham Vinay
భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్ కోసం DCGI అనుమతిని కోరడం జరిగింది. ఇక ఓమిక్రాన్ వేరియంట్ కి సంబంధించిన వేగవంతమైన వ్యాప్తి కారణంగా ఇంట్రానాసల్ COVID-19 బూస్టర్ యొక్క ట్రయల్స్ కోసం ముందస్తు ఆమోదం కోసం కంపెనీ ఆశించడం జరుగుతోంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...భారతదేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తమ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్  బూస్టర్ డోస్ కోసం ఆమోదం పొందడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి దశ 3 క్లినికల్ ట్రయల్ అప్లికేషన్‌ను సమర్పించడం అనేది జరిగింది. "మేము DCGIకి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ అప్లికేషన్‌ను సమర్పించాము. మాస్ టీకా ప్రచారంలో ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా అందించడం సులభం అవుతుంది. ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌లు ట్రాన్స్‌మిషన్‌ను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి," అని ఓ ప్రముఖ వార్తా సంస్థ  మూలాలను ఉదహరించడం జరిగింది.


ఇక నివేదికల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే...భారత్ బయోటెక్ వారి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క బూస్టర్ డోస్ కోసం డిసెంబర్ 15న దరఖాస్తును సమర్పించింది, అది కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ టీకాలు వేసిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. B.1.1.529గా సూచించబడే Omicron వేరియంట్ యొక్క వేగవంతమైన వ్యాప్తి కారణంగా ఇంట్రానాసల్ COVID-19 బూస్టర్  ట్రయల్స్ కోసం ముందస్తు ఆమోదం కోసం కంపెనీ ఆశిస్తోంది.భారతదేశంలో ఇప్పటివరకు 161 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం తెలిపడం జరుగుతుంది. కాబట్టి జనాలు చాలా అప్రమత్తంగా ఉండాలి.ఎక్కువగా బయటకి రాకుండా ఇంట్లోనే పలు జాగ్రత్తలు తీసుకుంటూ వుండాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.ఇక భారతదేశంలో మూడవ డోస్ కోసం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ కోసం దరఖాస్తును సమర్పించిన రెండవ కంపెనీ భారత్ బయోటెక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: