తూర్పులో ఆ ముగ్గురు తమ్ముళ్ళకు బాబు షాక్ ఇస్తారా?
అందుకే కష్టపడి పనిచేస్తూ..ఎక్కడకక్కడ పార్టీని పికప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దాదాపు అందరూ నాయకులు ఇలా పార్టీ కోసం కష్టపడుతున్నారు. కానీ కొందరు నాయకులు ఎన్నికల సమయంలో చూసుకుందాంలే అప్పుడు పనులు చేసుకుందాం అన్నట్లు కాలం గడిపేస్తున్నారు. అలా కాలం గడిపే నేతలకు చంద్రబాబు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చేశారు. సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తానని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే కొందరు నాయకులని పక్కన పెడుతున్నారు కూడా...అయినా సరే కొందరు నేతల్లో చలనం రావడం లేదు. ఇంకా నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా పనిచేయడం లేదు.
ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కొందరు తమ్ముళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది. అలా సరిగ్గా పనిచేయని వారిలో ప్రత్తిపాడు ఇంచార్జ్ వరుపుల రాజా, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రామచంద్రాపురం ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు పెద్దగా యాక్టివ్‌గా లేరనే చెప్పాలి.
రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్ళడంతో రెడ్డి సుబ్రహ్మణ్యంని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే ఈయనకు మామూలుగానే ఫాలోయింగ్ తక్కువ...పైగా రామచంద్రాపురంలో వచ్చే పనిచేయడం లేదు. ఎంతసేపు తన సొంత నియోజకవర్గం కొత్తపేటలోనే ఎక్కువ గడుపుతున్నారు. అటు వరుపుల రాజా, వెంకటేష్‌లు సైతం ఏదో అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు తప్ప...ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉంటూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మాత్రం చేయడం లేదు. దీంతో ఆ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవ్వని పరిస్తితి. మరి ఇలా సరిగ్గా పనిచేయని నాయకులకు చంద్రబాబు షాక్ ఇచ్చేస్తారేమో చూడాలి.