వంట చేస్తే లోన్.. మగ వాళ్ళకు మాత్రమే.. స్పెషల్ ఆఫర్?
ఇటీవలి కాలంలో చదువులో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడి ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వివక్షను తొలగించేందుకు ఇటీవల కేరళ రాష్ట్రంలో ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక అక్షరాస్యతకలిగిన రాష్ట్రం ఏది అంటే అందరూ టక్కున చెప్పేస్తారు కేరళ అనీ. ఇప్పటి వరకూ మహిళలు పురుషులు అనే తేడా లేకుండా లింగ వివక్షత చూపకుండా అందరినీ చదివిస్తూ అక్షరాస్యతలో టాప్ లో కొనసాగుతుంది కేరళ. ఇక ఇప్పుడు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం ప్రజల్లో ఉన్న లింగ వివక్షను జయించే విధంగా కొత్త పని మొదలు పెట్టింది కేరళ. అమ్మాయిలకు మాత్రమే కాదు అబ్బాయిలు కూడా ఇంటి పని వంట పని వస్తే మంచిదని ఆ దిశగా అందరిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. దీని కోసం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ కిచెన్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం గమనార్హం. మగ పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక వంటల్లో శిక్షణ ఇస్తూ వంట బాగా చేసిన వారికి అవార్డులు కూడా ఇస్తారట. అంతేకాదండోయ్ ఇక ఆసక్తి ఉన్న మగవాళ్ళకి ఏకంగా లోన్ అందించేందుకు కూడా సిద్ధమవడం గమనార్హం. కరోనా వైరస్ తర్వాత మహిళలపై ఎక్కువగా పని భారం పెరిగిపోయిందని అందుకే కొంత ఉపశమనం కలిగించేందుకు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టాము అంటూ చెప్పుకొచ్చారు.