ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. తైవాన్ తో భారత్ ఒప్పందం?

praveen
ఇప్పటికే పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాల ను స్వాధీనం చేసుకుం టూ విస్తరణ ధోరణితో ముందుకు సాగుతున్న దేశం చైనా కన్ను ప్రస్తుతం తైవాన్ దేశం పైన పడింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తైవాన్ సరిహద్దుల్లో వరుసగా కవ్వింపు లకు  పాల్పడుతూ ఉండడం గమనార్హం. అంతేకాకుండా చైనాకు చెందిన యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలో కి పంపుతుంది చైనా. గత కొంతకాలం నుంచి చైనా తైవాన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే తైవాన్ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ అమెరికా ఇప్పటికే చైనా కు వార్నింగ్ ఇచ్చింది. అటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా తైవాన్ కు అండగా నిలబడతామని చెబుతూ.. తైవాన్ ను ఒక స్వతంత్ర దేశంగా మాత్రమే చూస్తూ ఉన్నాయి. ఇక తైవాన్కు ఆర్థికంగా  ఆయుధ పరంగా కూడా సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో  భారత్ కూడా ముందడుగు వేసింది. తైవాన్ తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సిద్ధమైంది.



 ఇప్పటికే ఎన్నో ప్రపంచ దేశాలతో ఎంతో వ్యూహాత్మకంగా దౌత్యపరమైన సంబంధాలను పెట్టుకుంటూ ఎన్నో ఒప్పందాలను చేసుకుంటూ వస్తుంది భారత్. తైవాన్ తో  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది భారత్. అంటే ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో తైవాన్ భారత్ మధ్య ఎగుమతులు దిగుమతులు జరిగే విధంగా.. అంతేకాకుండా భారత్ కు చెందిన ఎన్నో కంపెనీలు తైవాన్లో.. తైవాన్కు చెందిన ఎన్నో కంపెనీలు భారత్లో కూడా సంస్థలు స్థాపించి విధంగా.. ప్రస్తుతం భారత్
 స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ ఒప్పందం వెనుక రెండు వ్యూహాలు  ఉన్నాయి అని అంటున్నారు  విశ్లేషకులు. ఒకవైపు చైనా ఆధిపత్యం లెక్క చేయకపోవడం... ఇక మరోవైపు భారత్ భవిష్యత్తు అవసరాలకే  ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి వ్యూహాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: