ఉగ్ర‌వాదం : ఐసీస్‌లో భార‌త సంత‌తి ముష్క‌రులు.. ఎంత‌మంది అంటే..?

N ANJANEYULU
భారత సరిహద్దుల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న‌దని తాజాగా అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ నివేదికను కూడా విడుదల చేసిన‌ది. భారత ఉపఖండంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయని నివేదిక‌లో వెల్ల‌డించారు. అదేవిధంగా  జమ్మూ కాశ్మీర్, ఈశాన్య, మధ్య భారతదేశం తీవ్రవాద-ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రభావితమైన ప్రాంతాలుగా పేర్కొన్న‌ది.

క‌రుడుగ‌ట్టిన ఇస్లామిక్ స్టేట్‌లో భార‌త సంత‌తికి చెందిన ముష్క‌రులు 66 మంది ఉన్నార‌ని.. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా త‌న నివేదిక‌లో పేర్కొంది. అదేవిధంగా ఉగ్ర‌భూతంపై జ‌రిగే పోరులో భార‌త్ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని కితాబు ఇచ్చింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ ధాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌లో ఉగ్ర‌వాదం ఏ స్తాయిలో ఉన్న‌దో నివేదిక‌లో వెల్ల‌డించింది. ముఖ్యంగా గ‌గ‌న‌త‌ల ప్ర‌యాణికుల భ‌ద్ర‌త కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తామండలి తీర్మానంను అమెరికాతో క‌లిసి భార‌త్ అమ‌లు చేస్తోంది.

విమానాశ్ర‌యాల్లో ఎక్స్ రే ద్వారా కార్గో స్క్రీనింగ్ స‌మ‌గ్రంగా నిర్వ‌హిస్తున్న‌ది. ముఖ్యంగా అమెరికా, భార‌త్ ఇరు దేశాలు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంతో ఉగ్ర‌వాదంపై  పోరాడుతూ ఉన్నాయి. అంత‌ర్జాతీయ, ప్రాంతీయ‌, ఉగ్ర‌శ‌క్తుల‌ను గుర్తించి.. వాటికి ముక్కుతాడు వేయ‌డంలో ఎన్ఐఏతో స‌హా భార‌త ఉగ్ర నిరోధ‌క బ‌ల‌గాలు కీల‌కంగా ప‌ని చేస్తున్నాయి. ఐసిస్‌కు సంబంధించిన 34 కేసుల‌ను ఎన్ఐఏ ప‌రిశీలించి.. 160 మందిని అరెస్ట్ చేసింది. కేర‌ళ‌, ప‌శ్చిమ‌బెంగాల్ లో ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ నెల‌లో అరెస్ట‌యిన 10 మంది  అందులో అల్‌ఖైదా ఉగ్ర‌వాదులు కూడా ఉన్నారు. గ‌త ఏడాది జ‌మ్మూకాశ్మీర్‌, ఈశాన్య భార‌త‌దేశంతో పాటు భార‌త్‌లోని మావోయిస్ట్ ప్ర‌భావిత ప్రాంతాల‌లో కూడా ఉగ్ర కార్య‌క‌లాపాలు చోటు చేసుకున్నాయి. అయితే భారత భద్రతా దళాలు పెట్రోలింగ్ విస్తృతమైన సముద్ర, భూ సరిహద్దులలో పరిమిత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయ‌ని నివేదిక‌ పేర్కొన్న‌ది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: